'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో యూత్ కింగ్ అఖిల్ అక్కినేని - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్''. యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 8న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేకర్స్.. తాజాగా ‘లెహరాయి’ అనే సాంగ్ లిరికల్ వీడియోని విడుదల చేశారు.
'లెహరాయి లెహరాయి.. గుండె ఊహలెగిరాయి.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి.. గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి.. ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి.. కళ్ళలోన దాగి ఉన్న అమ్మాయి.. సొంతమల్లె చేరుతుంటే.. ప్రాణమంత చెప్పలేని హాయి..' అంటూ సాగిన ఈ రొమాంటిక్ బ్రీజీ మెలోడీ శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ సాంగ్ కు అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేయగా.. లిరిసిస్ట్ శ్రీమణి అందమైన సాహిత్యం సమకూర్చారు.
'లెహరాయి' గీతాన్ని యువ గాయకుడు సిద్ శ్రీరామ్ తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు. సిద్ మరోసారి తన వాయిస్ తో మ్యాజిక్ క్రియేట్ చేసాడని చెప్పవచ్చు. అఖిల్ - పూజా హెగ్డే లపై చిత్రీకరించిన ఈ పాటలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టాడు. కెమెరామెన్ ప్రదీశ్ వర్మ అందించిన విజువల్స్ బాగున్నాయి. దీనికి అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు. రఘు మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి వస్తుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'మనసా మనసా' 'గుచ్చే గులాబీ' 'ఏ జిందగీ' పాటల మాదిరిగానే 'లెహరాయి' కూడా చార్ట్ బస్టర్ గా నిలిస్తుంది. గోపీసుందర్ స్వరపరిచిన సాంగ్స్ ఈ సినిమా విజయానికి దోహదపడతాయని చెప్పొచ్చు.
అల్లు అరవింద్ సమర్పిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఆమని - ఈషా రెబ్బా - చిన్మయి - వెన్నెల కిషోర్ - మురళీశర్మ - జయప్రకాష్ - ప్రగతి - అమిత్ తివారి - సుడిగాలి సుధీర్ - గెటప్ శ్రీను - అభయ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. దసరా బరిలో దిగుతున్న ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
Full View