‘వేదం’ సినిమాలో మంచు మనోజ్ కు జోడీగా నటించిన లేఖా వాషింగ్టన్ గుర్తుందా? దాంతో పాటుగా తెలుగులో ఇంకా ఒకటీ అరా సినిమాలు చేసింది లేఖా. తెలుగుతో పోలిస్తే తమిళంలో ఆమెకు ఎక్కువ అవకాశాలే వచ్చాయి. అక్కడ ఓ మోస్తరుగా పేరు సంపాదించింది. ఐతే మూడేళ్ల నుంచి ఆమె కెరీర్ ఏమంత బాగా లేదు. ఇప్పుడామె ఉన్నట్లుండి వార్తల్లోకి వచ్చింది. ఒక టైంలో తాను ఒక దర్శకుడి వల్ల సెక్స్ టార్చర్ అనుభవించానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.
యాంకర్ స్థాయి నుంచి తాను ఎంతో కష్టపడి హీరోయిన్ గా ఎదిగానని.. ఐతే సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిల్ని వేధించే వాళ్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని లేఖ పేర్కొంది. ఒక దర్శకుడు తనకు కథకు చెప్పిన అనంతరం.. ‘నేను నీకు అవకాశం ఇస్తున్నా కదా.. మరి బదులుగా నాకేం ఇస్తావ్’ అని అడిగాడని.. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా.. తనకేమీ అర్థం కానట్లు ఉండగా.. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న వేసి వేసి తనను వేధించాడని.. అతడి వల్ల టార్చర్ అనుభవించానని లేఖ తెలిపింది.
సినిమా నటిగా జీవించడం అంత సులువైన విషయం కాదని.. హీరోయిన్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటారని లేఖ పేర్కొంది. మలయాళ నటి భావన కిడ్నాప్.. లైంగిక వేధింపుల ఘటన చర్చనీయాంశమైనప్పటి నుంచి సౌత్ ఇండియాలో చాలామంది హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా మీడియాకు చెప్పుకుంటున్నారు. లేఖా వాషింగ్టన్ కూడా ఈ జాబితాలోకి చేరింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/