టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో తన 6వ నామినేషన్ తో ఆస్కార్ అందుకున్నాడు. 15 ఏళ్ల తన కలను ది రెవెనెంట్ చిత్రంతో సాకారం చేసుకున్నాడు లియోనార్డో. ఈ అవార్డుతో పాటే.. ఒక నిమిషంలో అత్యధిక ట్వీట్స్ పొందిన రికార్డును కూడా ఈ హీరో సొంతం చేసుకున్నాడు. డికాప్రియోకి విషెస్ చెబుతూ నిమిషానికి 4,40,000వేల ట్వీట్స్ చొప్పున వచ్చాయి. ఇప్పటి వరకూ మొత్తం ఆస్కార్ లైవ్ ప్రసారాల్లో ఇదే అత్యధిక రికార్డ్.
ఇంతకుముందు ఈ రికార్డ్ ఎల్లెన్ డిజెరస్ పేరిట ఉంది. 2014లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానంలో యాంకర్ గా ఎల్లెన్ వ్యవహరించగా.. ఆ వేడుకకు హాజరైన వారందిరితో కలిపి తీయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పుడా ఫోటోకు నిమిషానికి 2,55,000 చొప్పున ట్వీట్స్ వచ్చాయి. ఈ పోస్ట్ మొత్తం 33.4 లక్షల సార్లు రీట్వీట్ చేయడం విశేషం. ఇప్పుడా రికార్డును టైటానిక్ హీరో తుడిచిపెట్టేసి, తన పేరుతో కొత్త రికార్డును సృష్టించేసుకున్నాడు.
ఫేస్ బుక్ లో కూడా బజ్జింగ్ ఛార్ట్ లో లియోనార్డో టాప్ బ్లేస్ లో ఉండడం విశేషం. ఇక ట్విట్టర్, ఫేస్ బుక్ రెండింటిలోనూ లియోనార్డో తరువాత స్థానంలో.. ఉత్తమ చిత్రంగా ఎంపికైన స్పాట్ లైట్ రెండో స్థానంలో నిలిచింది. లియోనార్డో డికాప్రియో ఆస్కార్ అందుకున్నాక.. దాదాపు అందరు హాలీవుడ్ నటులు అభినందనలు చెబుతూ ట్వీట్లు చేశారు.