లైగర్‌ అప్డేట్‌.. మరో వీడియో వదలబోతున్నారట

Update: 2022-07-28 11:30 GMT
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'లైగర్‌' పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం తెలుగు ప్రేక్షకుల్లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా పై జనాల్లో ఇంట్రెస్ట్ కలిగించడం లో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇప్పటికే ట్రైలర్‌ తో లైగర్ స్థాయిని పెంచేశారు. బాలీవుడ్‌ సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది.

పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్ కరణ్‌ జోహార్‌ నిర్మించడంతో పాటు సమర్పిస్తున్నాడు. దాంతో అక్కడ సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా నుండి ఫస్ట్‌ లుక్‌ వచ్చినప్పటి నుండి కూడా అంచనాలు పెరిగాయి. తాజాగా ట్రైలర్‌ ను విడుదల చేసిన యూనిట్‌ సభ్యులు అంచనాలు భారీగా పెంచేశారు.

ఇప్పటికే ఉన్న అంచనాలు పెంచే ఉద్దేశ్యంతో లైగర్ యాటిట్యూడ్‌ గ్లిమ్స్ అంటూ ఒక వీడియోను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. లైగర్ లో తన యాటిట్యూడ్‌ ను చూపించడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకున్న విజయ్ దేవరకొండ ఈసారి మరో వీడియో తో తన యాటిట్యూడ్‌ ను చూపించేందుకు గాను ఈనెల 29న రాబోతున్నాడు.

ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లైగర్‌ సినిమా ప్రమోషన్స్‌ ను షురూ చేశారు. దేశ వ్యాప్తంగా విడుదల సమయం కు పెద్ద ఎత్తున ఈవెంట్స్ ను నిర్వహించడం తో పాటు సాధ్యం అయినంత ఎక్కువ గా సినిమా ను సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ సినిమా నుండి బ్యాక్ టు బ్యాక్‌ ఏవో వీడియోలు వస్తాయంటున్నారు.

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో నటిస్తున్న కారణంగా అక్కడి ప్రేక్షకుల్లో ఇంకాస్త ఎక్కువ ఆసక్తి ఉంది. పైగా ఈ సినిమా లో రియల్‌ హీరో మైక్ టైసన్ కూడా ఉండటం వల్ల అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. అంచనాలను అందుకుంటాను అంటూ చాలా నమ్మకంతో పూరి కనిపిస్తున్నాడు.

విజయ్ దేవరకొండ కు కూడా ఈ సినిమా అత్యంత కీలకం. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే నెల 25వ తారీకు వరకు వెయిట్‌ చేయాల్సిందే.
Tags:    

Similar News