లైగర్‌ బ్యూటీ కొత్త ప్రేమలో పడిందా..? ఇదే సాక్ష్యం!

Update: 2022-10-21 08:30 GMT
బాలీవుడ్ యంగ్ హాట్ బ్యూటీ అనన్య పాండే ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొన్నాళ్లు అయినా కాకుండానే అప్పుడే ప్రేమలో పడటం.. విఫలం అవ్వడం మళ్లీ ప్రేమలో పడటం చకచక జరిగి పోయినట్లుగా తాజా పరిణామాలు చూస్తూ ఉంటే అనిపిస్తుందని బాలీవుడ్ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

లైగర్ తో సౌత్‌ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు విజయ్ దేవరకొండ కు జోడీగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుందని చెప్పుకోవచ్చు. లైగర్ సినిమా విడుదల సమయంలోనే ఈ అమ్మడి యొక్క లవ్ స్టోరీ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఇషాన్ కట్టర్‌ తో ఈమె ప్రేమలో పడటం.. కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడం జరిగింది.

ఇద్దరు కూడా తాము విడిపోయాం అన్నట్లుగా చెప్పేశారు. ఇషాన్ తాను పూర్తిగా కెరీర్ పై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక అనన్య పాండే కూడా తాను ప్రేమలో మోసపోయాను అంటూ ఆ మధ్య ఆవేదన వ్యక్తం చేస్తూ పలు టాక్‌ షో ల్లో కామెంట్స్ చేసింది.

ఆ మధ్య ఆధిత్య రాయ్ కపూర్ తో ఈ అమ్మడు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని అనన్య కూడా అనధికారికంగా కన్ఫర్మ్‌ చేసింది.

తాజాగా మనీష్‌ మల్హోత్ర దీపావళి పార్టీ లో వీరిద్దరు కలిసి కనిపించారు. కలిసి హాజరు అవ్వడంతో పాటు కలిసి పార్టీలో తెగ ముచ్చట్లు పెట్టుకున్నట్లుగా పాల్గొన్న వారు అంటున్నారు. నేహా దుపియా షేర్ చేసిన ఒక సెల్ఫీ లో దూరాన వీరిద్దరు కలిసి ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్లుగా కూడా చూడవచ్చు.

మొత్తానికి వీరిద్దరు ప్రేమలో పడ్డారు అనేది క్లారిటీ వచ్చిందని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. ఆధిత్య రాయ్ కపూర్ మరియు అనన్య పాండే జోడీ చక్కగా ఉంటుందని చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనన్య చేస్తున్న సినిమాలతో కంటే ఇలాంటి వార్తలతోనే ఎక్కువగా మీడియాలో ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News