ట్రోలింగ్ పై 'లైగ‌ర్' బ్యూటీ ఇలా ఫీల‌వుతుదా?

Update: 2022-08-24 23:30 GMT
తేడా జ‌రిగితే ఎంత‌టి సెల‌బ్రిటీ అయినా ట్రోలింగ్ ఎదుర్కోక త‌ప్ప‌దు. బాలీవుడ్ సెల‌బ్రిటీల విష‌యంలో ఈ ట్రోలింగ్ దాడి మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఈ విష‌యంలో బిగ్ అమితాబ‌చ్చ‌న్ ని సైతం  విడిచిపెట్ట‌లేదు. ఆయ‌న ట్రోల‌ర్ బాధితుడే. ఇక మిగ‌తా హీరోలు..హృరోయిన్ల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. ఏదో విష‌యంలో సెల‌బ్రిటీలు ట్రోలింగ్ ఎదుర్కూంటూనే ఉంటున్నారు.

అయితే ఈ ట్రోలింగ్ ని ఎవ‌రు ఎలా తీసుకుంటారు? అన్న‌ది ఇక్క‌డ ఇంపార్టెంట్.  కొంత మంది వీటిని ఏ మాత్రం ప‌ట్టిచుకోకుండా హెల్దీగా ఉంటారు . మ‌రికొంత మంది మ‌న‌స్తానికి గురై కొద్ది రోజుల‌కు తేరుకుంటారు. ఇక  దీపికా ప‌దుకొణే...ప్రియాంక చోప్రా..కంగ‌నా ర‌నౌత్ వంటి వారు సంద‌ర్భాన్ని బ‌ట్టి ట్రోల‌ర్ల‌కి బ‌ధులిస్తుంటారు.

తాజాగా ఇవే ప్రశ్న‌లు  న‌వ నాయిక లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే ముందుకు వెళ్లాయి. ట్రోలింగ్ బారిన ప‌డిన‌ప్పుడు  ఎలా రియాక్ట్ అవుతారు?   మీ మాన‌సిక స్థితి ఎలా ఉంటుంది? అని ప్ర‌శ్నించ‌గా .. `ఇది ఆ రోజుపై నేను ఉన్న స్థితి పై  ఆధారపడి ఉంటుంది.  సహజంగా కొన్ని రోజులపాటు ఆ ప్ర‌భావం ఉంటుంది. ఆ త‌ర్వాత  కొన్ని రోజులకి అన్ని మ‌ర్చిపోతాను.

ఇది  సాధారణంగా అంద‌రి విష‌యంలో జ‌రిగే ప్రక్రియ‌.  ప్ర‌తీ మనిషి క‌లిగి ఉండే  ఉండే మానవ ప్రతిచర్య ఇది. ఇలాంటివి ఎదురైన‌ప్ప‌డు మ‌రింత మెరుగ్గా ఉండాలి. ప్రజలు న‌న్ను  ఇంటర్వ్యూలలో  లేదా బహిరంగంగా చూసినప్పుడు మాత్రమే నా వ్యక్తిత్వం యొక్క ఒక కోణాన్ని మాత్ర‌మే చూడ‌గ‌ల్గుతారు. కానీ నా గురించి తెలియాల్సింది చాలానే ఉంటుంది.

ఐదు నిమిషాల సంభాషణ కంటే తెలుసుకోవాల్సింది  చాలా ఎక్కువ ఉందని  వారు గ్రహించాలి. నేను ఎప్పుడు ఎలాంటి హడావిడిలో  ఉండ‌ను. నన్ను నేను నిరూపించుకోవాలని ..న‌టిగా  నన్ను ప్రజలు ఇష్టపడాలని కోరుకుంటున్నాను` అని తె లిపింది.

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ న‌టించిన `లైగ‌ర్` ఈనెల 25న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో అమ్మ‌డి డెబ్యూ మూవీ ఇది. హిట్ పై చాలా కాన్పిడెంట్ గా ఉంది.  కానీ రిలీజ్ కి ముందే అమ్మ‌డి వెంట బ‌డా సంస్థ‌లు ప‌డుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. బాలీవుడ్ లోనూ కొన్ని ప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అయింది. 
Tags:    

Similar News