లైగర్ బాక్సాఫీస్.. ఇక ముగిసినట్లే!

Update: 2022-08-30 04:04 GMT
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి సక్సెస్ అందుకోవాలి అని లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎంతో ఉన్నతంగా ఈ సినిమాను నిర్మించారు. బాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడంతో బాలీవుడ్ లో భారీగానే ఈ సినిమా విడుదల అయింది.

ఇక విజయ్ ప్రమోషన్స్ విషయంలో కూడా చాలానే కష్టపడ్డాడు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా దేశమంతా చుట్టేశాడు. అయితే అతనికి జనాల నుంచి క్రేజ్ బాగానే రావడంతో సినిమాకు ఓపెనింగ్స్ అయితే భారీగానే దక్కాయి.

అసలు హిందీలో విజయ్ ఆ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటాడా అనేది ముందుగా ఎవరూ ఊహించలేదు. తెలుగు కలెక్షన్స్ అయితే రెండవ రోజు భారీగా డౌన్ అయ్యాయి.

కానీ హిందీ కలెక్షన్స్ మాత్రం వీకెండ్ వరకు బాగానే వచ్చాయి. ఇక ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రభావం కూడా ఈ సినిమాపై కొంత పడినప్పటికీ కూడా కలెక్షన్స్ అయితే పరవాలేదు అనే విధంగా వచ్చాయి. హిందీ వెర్షన్ లో  శుక్రవారం 4.50 కోట్లు రాగా శనివారం కొంత డ్రాప్‌ను చూసింది. ఇక శనివారం 4.15 కోట్లు రాగా ఆదివారం 3.60 కోట్లు వచ్చాయి. ఫైనల్ గా మొదటి వారాంతంలో టోటల్ గా లైగర్ రూ. 13.25 కోట్లు రాబట్టింది.

ఇక ఈ చిత్రం మొదటి సోమవారంకు వచ్చే సరికి ఒక్కసారిగా డౌన్ అయ్యింది. సోమవారం రోజు రూ.  హిందీ వెర్షన్‌కు 1.25 కోట్లు మాత్రమే వచ్చాయి.

ఇక ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్ల బిజినెస్ చేయగా ఇప్పుడున్న డిమాండ్ ను బట్టి  ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లు రావడం గొప్ప అనే అనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇన్వెస్టర్లందరికీ ఈ చిత్రం నష్టాలను మిగిల్చింది. ఇక నష్టాన్ని భరించేందుకు నిర్మాతలు ముందుకొస్తారో లేదో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News