విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ''లైగర్'' మూవీ భారీ అంచనాల నడుమ విడుదలైంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీకి తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి ఆక్యుపెన్సీ చూసి ఇది డిజాస్టర్ గా మిగిలే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
'లైగర్' సినిమా అన్ని భాషల్లో కలిపి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 33.12 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి వచ్చిన టాక్ మరియు రివ్యూలను బట్టి లాంగ్ రన్ లో నిలబడటం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో విజయ్ చిత్రానికి గట్టి దెబ్బ పడిందని అంటున్నారు.
హిందీ బెల్ట్ లో 'లైగర్' సినిమా గురువారం పెయిడ్ ప్రీమియర్స్ మరియు శుక్రవారం కలెక్షన్స్ కలుపుకొని రూ. 5.5 కోట్లు నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇది మంచి ఓపెనింగ్ నంబర్ అయినప్పటికీ.. హిందీ హక్కులు మరియు భారీ ఎత్తున రిలీజ్ అవ్వడాన్ని పరిగణనలోకి తీసుకొని చూస్తే మాత్రం తక్కువనే చెప్పాలి.
'లైగర్' చిత్రాన్ని ముందు నుంచే తెలుగుతో పాటుగా హిందీ జనాలను దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేశారు మేకర్స్. ఆగ్ లగా దేంగే అంటూ నార్త్ లో ప్రమోషన్స్ చాలా గట్టిగానే చేశారు. కరణ్ జోహార్ కూడా ఉండటంతో భారీ స్థాయిలో విడుదల చేయగలిగారు. అయితే ఈ చిత్రానికి తెలుగులోనే కాదు అటు హిందీలోనూ నెగెటివ్ టాక్ వచ్చింది. ఇదొక ఔట్ డేటెడ్ మూవీ అని బాలీవుడ్ క్రిటిక్స్ సమీక్షలు ఇచ్చారు.
భారీ కలెక్షన్స్ అందుకోడానికి ఏ సినిమాకైనా మౌత్ టాక్ అనేది కీలకం. ఇప్పుడు 'లైగర్' కు హిందీలో మంచి టాక్ రాలేదు. ఫస్ట్ డే వసూళ్లు మాత్రం పర్వాలేదనిపించాయి. కాకపోతే డిజాస్టర్ టాక్ రావడంతో హిందీ సర్క్యూట్స్ లో ముందుకు సాగడం కష్టమనే చెప్పాలి.
నిజానికి 'పుష్ప' ఫస్ట్ డే వసూళ్ల కంటే 'లైగర్' కు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అయితే అల్లు అర్జున్ చిత్రానికి ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. మౌత్ టాక్ బాగుండటంతో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేయగలిగింది. 'కార్తికేయ 2' సినిమా కూడా ఎలాంటి హడావుడి లేకుండా వచ్చి హిందీ బెల్ట్ లో అంచనాలకు మించి వసూళ్ళు సాధిస్తోంది.
కానీ ఇక్కడ 'లైగర్' పరిస్థితి వేరు. ముందు నుంచే బాలీవుడ్ ను టార్గెట్ పెట్టుకునే సినిమా చేశారు. అయితే సినిమా మీద పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. మౌత్ టాక్ అయినా బాగుంటే 'పుష్ప' సినిమా మాదిరిగా లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ వచ్చేవి. కానీ అలా జరగలేదు.
'లైగర్' అనేది విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాథ్ లకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాతో బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంటామనే ధీమాతోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మౌత్ టాక్ మరియు అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి చూస్తే, భారీ వసూళ్లను ఆశించడం అత్యాశే అవుతుంది. మరి ఈ టాక్ తో ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా ఏ మేరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.