'లైగర్' ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే..?

Update: 2022-08-26 05:30 GMT
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ''లైగర్''. భారీ అంచనాల నడుమ నిన్న గురువారం థియేటర్లలోకి వచ్చిన ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ సినిమా.. తొలి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

'లైగర్' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 9.60 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ఇది విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. అలానే 'ఉప్పెన' సినిమా సాధించిన రూ 9.20 కోట్లు షేర్ ని అధిగమించింది. ప్రపంచ వ్యాప్తంగా 13.35 కోట్ల షేర్ తో 24.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు.

'లైగర్' చుట్టూ నెలకొన్న హైప్ వల్ల ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. దీనికి తగ్గట్టుగానే తొలి రోజు మంచి వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. యూఏస్ఏ ప్రీమియర్స్ నుంచి $500k కలెక్ట్ చేసింది. అయితే ప్రీమియర్ షోలకే నెగెటివ్ టాక్ రావడంతో రెండో రోజు అక్కడ సినిమా చూసే ధైర్యం చేయడం లేదని బుకింగ్స్ ని బట్టి అర్థమవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను రూ. 55 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం. మూవీ మౌత్ టాక్ ని బట్టి ఈరోజు నుంచి వసూళ్ళు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఫస్ట్ డే నైజాంలో 4.20 కోట్లు కలెక్ట్ చేయగా.. సీడెడ్ లో 1.40 కోట్లు - ఉత్తరాంధ్ర లో 1.27 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోడానికి 'లైగర్' చాలానే వసూలు చేయాల్సి ఉంది. శుక్ర - శని - ఆదివారాల్లో వచ్చే కలెక్షన్స్ బట్టే ఈ సినిమా నిర్మాతలకు ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందనేది తెలుస్తుంది. మరి బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కలిసి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైస్ 'లైగర్' ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు పరిశీలిస్తే...
నైజాం - 4.20 కోట్లు
సీడెడ్ - 1.40 కోట్లు
UA - 1.27 కోట్లు
గుంటూరు - 0.83 కోట్లు
ఈస్ట్ - 0.64 కోట్లు
వెస్ట్ - 0.39 కోట్లు
కృష్ణ - 0.49 కోట్లు
నెల్లూరు - 0.40 కోట్లు
AP/TS మొత్తం - 9.62 కోట్లు (షేర్)

కాగా, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో 'లైగర్' చిత్రాన్ని తెరకెక్కించారు పూరీ. ఇందులో ఎంఎంఏ ఫైటర్ గా VD అదరగొట్టాడు. అయితే ఆసక్తికరమైన కథ కథనాలు లేకపోవడం ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇందులో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా.. మైక్ టైసన్ - రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్ & పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్ - ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.
Tags:    

Similar News