ఓవర్సీస్ లో 'లైగర్' నష్టం ఎంతంటే..?

Update: 2022-09-04 05:44 GMT
కరోనా పాండమిక్ టైమ్ లో ఓవర్ సీస్ మార్కెట్ కుదేలైపోయింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోంది. ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పలు తెలుగు సినిమాలు యూఎస్ఏలో మంచి వసూళ్ళు రాబట్టాయి. అదే సమయంలో 'లైగర్' లాంటి భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రాలు మాత్రం OS డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలు తెచ్చిపెట్టాయి.

విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ''లైగర్'' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లు బాగా నష్టపోయారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లోనూ ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో ఫలితంగా యాభై శాతం మేర నష్టపోవాల్సి వచ్చిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

పూరీ మరియు విజయ్ దేవరకొండ సినిమాలకు ఓవర్ సీస్ లో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబోలో రూపొందిన 'లైగర్' చుట్టూ నెలకొన్న హైప్ దృష్ట్యా ఈ మూవీ విదేశీ హక్కులు మంచి ధర పలికాయి. సరిగమ సినిమాస్ వారు ఈ చిత్రం యొక్క ఓవర్ సీస్ రైట్స్ ను ఎన్ఆర్ఎ ప్రాతిపదికన 6 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం.

విజయ్ 'లైగర్' పై ఓవర్ కాన్ఫిడెంట్ తో భారీ అంచనాలు ఏర్పడేలా ప్రమోషన్స్ చేసాడు. సినిమాపై మంచి బజ్ ఉండటంతో ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. అంతేకాదు హాలీవుడ్ సినిమాల స్థాయిలో అనేక పెద్ద స్క్రీన్లలో విడుదల చేసారు.

అయితే యూఎస్ ప్రీమియర్స్ తోనే 'లైగర్' కు నెగెటివ్ టాక్ వచ్చేసింది. ప్రీమియర్ షోల ప్రీ సేల్స్ తో పర్వాలేదనిపించినా.. తర్వాత ఏ దశలోనూ ఈ సినిమా లేవలేకపోయింది. లాంగ్ రన్ మీద ఆశతో భారీగా థియేటర్లు బ్లాక్ చేసి పెట్టుకున్న డిస్ట్రిబ్యూటర్.. తీవ్ర నష్టాలు చూడాల్సి వచ్చింది. ఈ సినిమా యుఎస్ లో 3 కోట్లు రాబట్టగలిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ఏడాది RRR - KGF 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలతో సరిగమ సినిమాస్ ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మంచి లాభాలతో పాటుగా ఖ్యాతిని గడించారు. కానీ ఇప్పుడు 'లైగర్' తో దెబ్బతిన్నారు. 50 శాతం మేర నష్టపోయారు. మరి ఇప్పుడు పూరీ వారికి నష్టపరిహారం చెల్లిస్తారా అనే చర్చ మొదలైంది.

'లైగర్' సినిమా కారణంగా నష్టపోయిన బయ్యర్లను ఆదుకోవాలని పూరీ జగన్నాధ్ నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వారంలోనే అందరికీ 30 శాతం మేర వెనక్కి తిరిగి ఇవ్వాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు కూడా సెటిల్ చేస్తారేమో చూడాలి. భవిష్యత్ చిత్రాలను దృష్టిలో పెట్టుకొని విదేశీ పంపిణీదారులతో సద్భావనను కలిగి ఉండటం అవసరం. మరి పూరీ ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News