విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా రూపొందింది. పూరి .. చార్మీ .. కరణ్ జొహార్ నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. వరుస ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తూనే, గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి భారీ సంఖ్యలో జనాలు తరలి వచ్చారు. ఈ సినిమాలో విలన్ గా నటించిన 'విష్' ఈ స్టేజ్ పై మాట్లాడాడు.
ఈ ఈవెంట్ కోసం చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి కూడా స్టూడెంట్స్ వస్తున్నారని విన్నాను. ఒకప్పుడు నేను కూడా కాలేజ్ కి బంక్ కొట్టి పూరి సినిమాలు చూసినవాడినే. అలా థియేటర్లకు రప్పించడం ఆయన ప్రత్యేకత. అనన్యను మీరు చూశారు కదా? ఒక స్టార్ హీరోయిన్ కి ఉండవలసిన క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయా లేదా? ఈ సినిమాతో ఆమె షేక్ చేస్తుంది చూడండి. ఇక చార్మీ విషయానికే వస్తే 13 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేయడం మొదలుపెట్టింది.
చార్మీ అనుకుంటే పెళ్లి చేసుకుని వెళ్లి ఈ ప్రపంచంలో ఎక్కడైనా హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ ఆమెకి సినిమా పట్ల ఉన్న పిచ్చితే ప్రతిరోజూ కష్టపడుతూ ఉంటుంది. అలాంటి ఆమెకి ఈ వేదిక ద్వారా హ్యాట్సాఫ్ చెబుతున్నాను. బోర్డర్ లో ఒక సోల్జర్ ఉన్నంత అలర్ట్ గా ఇండస్ట్రీలో ఉంటేనే అవకాశాలు వస్తాయి. 'లైగర్'లో ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా మారడానికి విజయ్ చాలా కష్టపడ్డాడు. ఒక లవర్ బాయ్ యాక్షన్ హీరోగా మారడమనేది అంత తేలికైన విషయమేం కాదు.
'లైగర్' లుక్ కోసం విజయ్ ఎంత హార్డ్ వర్క్ చేశాడనేది నాకు తెలుసు. 200 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఇండియా అంతా షేక్ చేస్తున్నాడు. లైఫ్ లో జీరో స్థాయికి వచ్చి మళ్లీ పైకి లేచినవాళ్లలో నేను పూరి సార్ ను మాత్రమే చూశాను. అందుకే ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. 'లైగర్' థియేటర్లలో చూడవలసిన సినిమా ఇది. ఈ నెల 25వ తేదీన థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూడండి" అంటూ చెప్పుకొచ్చాడు.