ప్రభాస్‌ ప్రాజెక్ట్ కే మాదిరిగా 'పుష్ప 2' కూడా అంతకు మించి!

Update: 2022-09-07 02:30 GMT
సౌత్‌ హీరోల్లో చాలా మంది ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. వారిలో కొందరు ఇప్పుడు పాన్ వరల్డ్‌ స్టార్స్ గా గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాలను హిందీ ప్రేక్షకులు చూడరు.. వారికి మన సినిమాలు ఏం నచ్చుతాయి అనుకున్నాం.. కానీ ఇప్పుడు మన సినిమాలే అక్కడ కుమ్మేస్తున్నాయి.

అందుకే రాబోయే రోజుల్లో పాన్ ఇండియా రేంజ్ లో కూడా మన సినిమాలు సత్తా చాటే అవకాశాలు లేక పోలేదు. ప్రయత్నిస్తే పోయేది ఏముంది అంటూ ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తన 'ప్రాజెక్ట్‌ కే' సినిమా పాన్ వరల్డ్‌ మూవీ అంటూ ప్రకటించాడు. కేవలం ఇండియన్ సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా చూస్తారని ధీమాతో ఉన్నాడు.

కేవలం ప్రాజెక్ట్‌ కే మాత్రమే కాకుండా ప్రభాస్ నటించబోతున్న స్పిరిట్‌ సినిమాను కూడా ఇండియా బయట ఆయా దేశాల స్థానిక భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ అధికారికంగా ప్రకటించాడు. ఇప్పుడు అదే దారిలో అల్లు అర్జున్‌ కూడా తన మార్కెట్‌ ను విస్తరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

కొన్ని దేశాల్లో మన సినిమాలకు మంచి డిమాండ్‌ ఉంది. ఆ డిమాండ్‌ కు అనుగుణంగా కాస్త మంచి కంటెంట్‌ తో అక్కడ వెళ్తే సంచలనాలు సాధించి డాలర్ల వర్షం చూడవచ్చు. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్‌ పుష్ప 2 ను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట.

పుష్ప సినిమా ఇప్పటికే పాటలు మరియు తగ్గేదే లే డైలాగ్ తో అంతర్జాతీయ స్థాయిలో పేరు దక్కించుకుంది. కనుక పుష్ప 2 కి మార్కెటింగ్‌ ఈజీ అయ్యే అవకాశం ఉంది. అందుకే విదేశాల్లో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయడం మాత్రమే కాకుండా.. అక్కడి భాషల్లో సినిమాను ప్రేక్షకులు ఆధరించే విధంగా సినిమాను రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది.

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న పుష్ప 2 సినిమా లో రష్మిక మందన్నా తో పాటు ఒక బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కీలక పాత్రలో నటింపజేయబోతున్నారట. పాన్ వరల్డ్‌ మార్కెట్‌ కోసం హాలీవుడ్‌ నటిని కూడా ఈ సినిమాలో నటింపజేస్తారేమో చూడాలి. మొత్తానికి బన్నీ చాలా పెద్ద ప్లాన్ వేశాడు. ఎంత వరకు వర్కౌట్ అయ్యేను అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News