రామ్ లాంటి హీరో దొరకడం అదృష్టమే!

Update: 2022-07-11 04:12 GMT
కోలీవుడ్ లో లింగుసామికి మంచి క్రేజ్ ఉంది. 20  ఏళ్ల క్రితం తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన, ఇంతవరకూ 10 సినిమాలను తెరకెక్కించారు. తన సినిమాలకి తనే కథలను తయారు చేసుకోవడం ఆయనకి అలవాటు.

తమిళంలో ఇంతవరకూ అజిత్ .. విక్రమ్ .. విశాల్ .. సూర్య .. కార్తి .. మాధవన్ .. ఆర్య వంటి స్టార్స్ తో ఆయన వరుస సినిమాలు చేశారు. తెలుగులో మొదటిసారిగా ఆయన రామ్ తో, తనకి ఇష్టమైన మాస్ యాక్షన్ జోనర్లోనే  'ది వారియర్' సినిమాను రూపొందించారు.  

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. " సినిమా చేయాలని చెప్పేసి శ్రీనివాస్ చిట్టూరి గారు ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చారో  .. అప్పటి నుంచి మేమిద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాము.

ఆయనకి సినిమా అంటే చాలా ఫ్యాషన్. కంటెంట్ ఉంటే .. కథకి అవసరమనిపిస్తే ఖర్చు పెట్టడానికి ఆయన వెనుకాడరు. కృతి శెట్టి విషయానికి వస్తే ఆమె నుంచి ఇంకా బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉంటే బాగుండునేమో అనుకున్నాను.

కానీ సినిమా చూసిన తరువాత తను చాలా గొప్పగా చేసిందనిపించింది. అందరూ తన యాక్టింగ్ .. డాన్స్ చూసి పొగుడుతూ ఉంటే నేను షాక్ అయ్యాను. బేబమ్మ సూపర్ .. చాలా బాగా చేసింది.

రామ్ విషయానికొస్తే తను డైరెక్టర్స్ హీరో .. తనలాంటి హీరో దొరకడం నా అదృష్టం. ఆయన టైమింగ్ .. డాన్స్ సూపర్. ఈ సినిమా విషయంలో అన్నిరకాలుగా నాకు ఆయన  సపోర్ట్ లభించింది. ఆయనతో మరో పది సినిమాలు చేయాలనుంది. పెద్ద ఆశనే .. తీరుతుందో లేదో చూడాలి " అంటూ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News