స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కొత్త సినిమా మొదలుపెట్టేస్తున్నారు. సరైనోడు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న బన్నీ.. హరీష్ శంకర్ తో మరుసటి ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇది ఫిక్స్ అయ్యే వరకూ బన్నీ డైరెక్టర్ గా వినిపించిన పేర్లలో లింగుస్వామి కూడా ఒకటి. విశాల్ తో పందెంకోడి 2 వదులుకుని మరీ.. అల్లు అర్జున్ సినిమా కి సిద్ధమయ్యాడని అన్నారు. తీరా చూస్తే బన్నీ ఇటు హరీష్ శంకర్ కే మొగ్గాడు. దీంతో లింగు స్వామి ప్రాజెక్ట్ అటకెక్కేసినట్లే అని అంతా అనుకుంటున్నారు.
అయితే బన్నీతో తన సినిమా క్యాన్సిల్ అయిపోలేదని చెబుతున్నాడు లింగుస్వామి. ప్రస్తుతం ఇద్దరం తమ తమ ప్రాజెక్టుల్లో బిజిగా ఉండడం కారణంగా.. జస్ట్ పోస్ట్ పోన్ చేశామంతే అంటూ క్లారిటీ ఇస్తున్నాడు. అటు బన్నీ చేస్తున్న ప్రాజెక్టు.. ఇటు విశాల్ తో తను తీస్తున్న పందెంకోడి2 పూర్తయ్యాక.. తమ ఇద్దరి కాంబోలో సినిమా రావడం ఖాయమన్నది లింగుస్వామి మాట. వచ్చే ఏడాది తామిద్దరం కలిసి ద్విభాషా చిత్రం చేస్తామని నమ్మకంగా ఉన్నాడీ దర్శకుడు. విశాల్ సినిమా చేస్తూనే.. బన్నీతో ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేయబోతున్నట్లు కూడా చెబుతున్నాడు.
అయితే ఇదంతా జరగడానికి వచ్చే ఏడాది సమ్మర్ రావాల్సి ఉంటుంది. విశాల్ తన మూవీని జనవరికే సిద్ధం చేసినా.. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ సమ్మర్ లో అనుకుంటున్నారు. అది రిలీజ్ అయ్యి రిజల్ట్ వచ్చాక కానీ.. బన్నీ తన నెక్ట్స్ సినిమా ఏది చేయాలో డిసైడ్ చేసే ఛాన్స్ లేదు. ఇప్పుడే తేలని లెక్కలు అప్పుడు తేల్చుకోవడం కష్టమే కావచ్చు.