చిన్న చిత్రాలను ఆదుకుంటున్న ముద్దులు

Update: 2018-08-26 16:00 GMT
ఒకప్పుడు చిన్న చిత్రాలు అంటే చిన్న చూపు ఉండేది. స్టార్‌ హీరోల సినిమాలకు మాత్రమే థియేటర్లు దక్కేవి. కాని ప్రస్తుతం పరిస్థితి మారింది. పెద్ద నిర్మాతలు కూడా చిన్న చిత్రాల దారిలోనే నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న చిత్రాలకు ఆధరణ పెరిగింది. టాలీవుడ్‌ లో ఆ నలుగురిగా పేరున్న నిర్మాతలు కూడా చిన్న చిత్రాలనే ఎక్కువగా తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో చిన్న చిత్రాల దర్శకులకు మంచి డిమాండ్‌ పెరిగింది. ఇక చిన్న చిత్రాలు సక్సెస్‌ అవ్వాలి అంటే ముద్దు సీన్స్‌ ఉండాలి అనేది ఈమద్య అందరు నమ్ముతున్న సెంటిమెంట్‌. వరుసగా సక్సెస్‌ అయిన చిన్న చిత్రాలను చూస్తే ఎక్కువ శాతం ముద్దు సీన్స్‌ తో యూత్‌ ఆడియన్స్‌ ను అలరించినవే ఉంటాయి.

‘అర్జున్‌ రెడ్డి’ ఒక చిన్న చిత్రంగా తెరకెక్కింది. ఆ చిత్రంలో విజయ్‌ దేవరకొండ - షాలిని పాండేల కాంబినేషన్‌ లో ఎన్నో ముద్దు సీన్స్‌ ఉన్నాయి. అందుకే సినిమా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ఆర్‌ ఎక్స్‌ 100 చిత్రం కూడా అదే దారిలో సూపర్‌ హిట్‌ ను దక్కించుకుంది. కేవలం ముద్దు సీన్స్‌ - హాట్‌ సీన్స్‌ ఉన్న కారణంగా యూత్‌ ఆడియన్స్‌ ను విపరీతంగా ఆ చిత్రం ఆకట్టుకుంది. కేవలం రెండున్నర కోట్లతో రూపొందిన ఆ చిత్రం ఏకంగా 25 కోట్లను నిర్మాతకు తెచ్చి పెట్టింది. ఇక తాజాగా వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రం కూడా ముద్దు సీన్‌ వల్లే ఈ రేంజ్‌ లో వసూళ్లు సాధిస్తుంది.

గీతగోవిందం చిత్రం మొత్తం ముద్దు బేస్‌ చేసుకుని కథ సాగుతుంది. ఇక క్లైమాక్స్‌ లో ఉన్న మద్దు సీన్‌ కూడా యూత్‌ కు పిచ్చెక్కించింది. అందుకే గీత గోవిందం రికార్డు స్థాయి వసూళ్లు సాధించి దుమ్ము రేపింది. చిన్న చిత్రాలు ఆడాలి అంటే ఖచ్చితంగా ముద్దు సీన్స్‌ ఉండాలి అనేది ఒక సెంటిమెంట్‌ గా మారడంతో కొత్తగా చిన్న చిత్రాలను చేయాలనుకుంటున్న వారు తమ సినిమాలో ముద్దు సీన్స్‌ పెట్టాలని నిర్ణయించుకున్నారు. చిన్న చిత్రాలను పెద్ద హీరోల ప్రమోషన్‌ ఆదుకోవచ్చు లేకపోవచ్చు - కాని ముద్దు సీన్స్‌ మాత్రం మినిమం గ్యారెంటీ చిత్రంగా నిలుపుతున్నాయి. ముందు ముందు మరిన్ని ముద్దు సీన్స్‌ ఉండే చిన్న చిత్రాలు రావడం ఖాయం.


Tags:    

Similar News