అయ్యి పెద్ద లిప్‌ కిస్సులు మరి!!

Update: 2015-11-20 13:55 GMT
ఈ శుక్రవారం రిలీజ్‌ అయిన కుమారి 21 ఎఫ్‌ ఓ మాంచి బోల్డు సినిమాగా ప్రశంశలు అందుకుంటోంది. అసలు ఇంతటి అద్భుతమైన కథను సుకుమార్‌ ఎలా రాశాడని ఇప్పటికే చాలామంది యూత్‌ పొగిడేస్తున్నారు. కాకపోతే ఈ సినిమాను ప్రమోట్ చేసినప్పుడు మాత్రం.. హెబా పటేల్‌ చెప్పిన ఆ లిప్‌ కిస్‌ మాటలే.. ఇప్పుడు అంతగా కిక్కివ్వట్లేదు.

ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 3-4 సార్లు లిప్పు కిస్సులు పెట్టేశా.. అంటూ హెబా అప్పట్లో ఇంటర్యూల్లో చెబుతుంటే.. అబ్బో కుమారి మామూలు డోస్‌ ఇవ్వలేదు అనుకున్నాం. కాని.. అక్కడంత సీన్‌ లేదస్సలు. ఇంకా తెలుగు సినిమాల్లో రెండు పెదాలనూ ఫ్రెంచ్‌ స్టయిల్లో లాకు వేసే రేంజ్‌ రాలేదనే చెప్పాలి. కేవలం పెదాల మీద పెక్‌ పెట్టడం తప్పించి.. మన హీరో హీరోయిన్లు ఇంకే చేయలేదులేండి. సో.. ఈ పెక్‌ లను పట్టుకొని లాక్‌ లు అంటే ఎలా.. వాటికోసం అంతగా కంగారుపడాల్సిందేం లేదు.

కంగారు ఎవరికి అంటారా? అదేనండీ.. సినిమాలో ఎలాగైనా వాటిని తిలకించాలని ఆత్రుత పడుతూ పర్సు జేబులో పెట్టుకోకుండా ధియేటర్లకు వెళ్ళిపోయే ఆవేశం బాబులున్నారే.. వారి గురించే!!
Tags:    

Similar News