పెళ్లయినా ఈ భామ రచ్చ తగ్గట్లేదుగా

Update: 2016-12-28 03:30 GMT
పెళ్లి చేసుకునేవరకూ ఒక లెక్క.. ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఉంటుంది హీరోయిన్ల వాలకం. ఇండియన్ హీరోయిన్స్ లో చాలామంది ఇదే పద్ధతి ఫాలో అయిపోతుంటారు. కొందరు మాత్రం పెళ్లయ్యాక కూడా యాక్టింగ్ కంటిన్యూ చేస్తూ.. మెరిపిస్తుంటారు. కానీ పెళ్లి కాక ముందు ఉన్న గ్లామర్ డోస్.. ఆ తర్వాత మాత్రం కనిపించదు. కానీ బాలీవుడ్ బ్యూటీ కం ఫ్యాషన్ డిజైనర్ అయిన లీసా హేడెన్ మాత్రం నా రూటే సెపరేటు అంటోంది.

తాజాగా వోగ్ మేగజైన్ కోసం లీసా హేడెన్ ఓ ఫోటో షూట్ చేసింది. ఏకంగా కవర్ పేజ్ కోసం పోజులు ఇచ్చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వోగ్ మేగజైన్ కవర్ పేజ్ పై కనిపించిన లీసా.. సెక్సీ పోజులతో మత్తెక్కించేసింది. బ్లాక్ బికినీలో బ్యాక్ అందాలను చూపిస్తూ.. హ్యాండ్సమ్ హంక్ హృతిక్ ను అతుక్కుపోయి మరీ లీసా హేడెన్ ఇచ్చిన పోజ్ చూస్తే మతిపోవాల్సిందే. ఈ యాంగిల్ లో పెళ్లయిన బ్యూటీ పోజులు ఇస్తుందని ఎవరూ ఊహించలేదు.

వాస్తవానికి ఈ అమ్మడి బ్యాక్ గ్రౌండ్ భలేగా ఉంటుంది. లీసా హేడెన్ ఫాదర్ తమిళియన్.. అమ్మ ఆస్ట్రేలియన్.. ఇండియాలో సెటిల్ అయ్యే ముందు ఆఫ్ఘనిస్తాన్.. అమెరికాల్లో పెరిగింది. అందుకే అన్ని కల్చర్స్ మిక్స్ చేసి ఇలా రెచ్చిపోతోందేమో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News