సౌత్ లో హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవలే రిలీజైన దేవరకొండ హారర్ బ్యాక్ డ్రాప్ చిత్రం `ట్యాక్సీవాలా` ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. హారర్ కామెడీ జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా .. కంటెంట్ ఉంటే విజయం అందుకుంటున్నాయి. ఇప్పుడు హారర్ సినిమాల్ని జనరేషన్ గ్యాప్ తో 3డి లో తెరకెక్కించేందుకు మన దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు. హారర్ కి రెగ్యులర్ 2డిలో కాకుండా 3డిని జోడిస్తే.. ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. అందుకే తెలుగమ్మాయ్ అంజలి కథానాయికగా అలాంటి ప్రయోగం చేస్తున్నారు. అంజలి కథానాయికగా తమిళ్-తెలుగు ద్విభాషా చిత్రం `లీసా` 3డి త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది.
లేటెస్టుగా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో `లీసా` ట్రైలర్ ని రివీల్ చేశారు. ``లీసా ట్రైలర్ ఒణికిస్తోంది.. ఇన్ స్పైరింగ్ 3డి సినిమా`` అంటూ ట్వీట్ చేశారు. గీతాంజలి లాంటి హారర్ బ్యాక్ డ్రాప్ సినిమాతో ఆకట్టుకున్న అంజలి ఈసారి 3డిలో ఇంకెంతగా భయపెట్టనుంది అన్నది అన్నది 2డి ట్రైలర్ చూసి చెప్పలేం. అయితే `లీసా` 2డి ట్రైలర్ మాత్రం పరమ బోరింగ్. వెరీ రెగ్యులర్ స్టఫ్ తో రొటీన్ హారర్ కహానీ అన్న చందంగా కనిపిస్తోంది. స్క్రిప్టు విషయంలో ఎక్కడా కొత్తదనం లేదు. అదే ఇల్లు.. అదే దెయ్యం.. అదే మనుషులు.. అదే భయం అన్న తీరుగానే ఉంది.
దట్టమైన అడవిని ఆనుకుని ఫామ్‌హౌస్ ఉండడం.. అందులో ఓ దెయ్యం .. ఆ దెయ్యంతో పుట్టే భయం.. ఇలాంటి కథలతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. కనీసం ఈ సినిమా కాన్సెప్టులో హాంటెడ్ తరహా ఉత్కంఠ కనిపించలేదు. అయితే రెగ్యులర్ 2డిలో కంటే ఇది 3డిలో చూస్తే థ్రిల్ కలుగుతుందేమో చూడాలి. ఈ సినిమాని రియల్ 3డిలో వీక్షిస్తే కలిగే అనుభవం వేరుగా ఉంటుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. రాజు విశ్వనాథ్ దర్వకత్వంలో పీజీ మీడియా వర్క్స్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా వర్మ ట్వీట్ వీళ్లకు ఏమేరకు బూస్ట్ ఇస్తుందో చూడాలి.
Full View