కిస్సిక్ పాటలో కసెక్కించే సోషల్ సెటైర్!
ఇటీవలే ఈ పాట లిరికల్ వీడియో కూడా రిలీజ్ అయి నెటి జనుల్లో కసెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
`పుష్ప-2` సినిమా ఓ ఎత్తైతే ఇందులో ఐటం పాట ఎలా ఉంటుంది? ఆపాటలో ఎవరు నటిస్తారు? సమంతని రీప్లేస్ చేసేది ఎవరు? అన్నది మరో ఎత్తులా ప్రచారం జరిగింది. సమంత మొదటి భాగంలో `ఊ అంటావా మావ` పాటతో ఇండియానే కాదు...వరల్డ్ నే ఊపేయడంతో ఇంతటి బజ్ క్రియేట్ అయింది. ఈ విషయంలో సుకుమార్ కూడా ఏమాత్రం తొందర పడలేదు. ఎంతో మంది భామల పేర్లను పరిశీలిచి చివరిగా డాన్స్ క్వీన్ శ్రీలీలను ఎంపిక చేసి కిసిక్ పాటను తెరకెక్కించారు.
ఇటీవలే ఈ పాట లిరికల్ వీడియో కూడా రిలీజ్ అయి నెటి జనుల్లో కసెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. `ఊ అంటవా మావ` పాటలో సమంత స్టెప్పులతో ఎంత సంచలనమైందో? కిసిక్ పాటతో శ్రీలీల కూడా అంతే ఫేమస్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. మాస్ లోకి వాయు వేగంతో దూసుకు పోతుంది. ఈ పాటను చంద్రబోస్ రచించారు. అయితే ఈ పాట కోసం బోస్ కొన్ని రకాల ట్రెండింగ్ అంశాలు కూడా జోడించారు.
బ్యాడ్ టచ్..డీప్ ఫేక్ వంటి వాటిపై సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే జరుగుతోంది. చాలా కాలంగా ఈ రెండు అంశాలు బర్నింగ్ టాపిక్ గా మారాయి. ఈ అంశాల్ని బోస్-సుకుమార్-డీఎస్పీలు తమ పాట కోసం తెలివిగా వినియోగించుకున్నారు. 'పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటేస.. 'కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ సేసారో', 'కని ఫేసెస్ గీసులు మార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి వేశాలు యేసరో' వంటి కొన్ని పంక్తులు.. దెబ్బలు పడతాయిరో? రో కిస్సిక్ దెబ్బలు పడతాయిరో వంటి పదాలతో పాటకు మంచి హైప్ వచ్చింది.
అలాగే చాలా కాలంగా మహిళల మార్పింగ్ ఫోటోలు ఎలా దుర్వినియోగానికి గురవుతున్నాయో తెలిసిందే. ఇలాంటి పదాల్ని సైతం పాటలో జోడించి సెటైర్ వేసారు. ఓవైపు కమర్శియల్ గా సక్సెస్ అందుకుంటూనే..మరోవైపు సెటైరికల్ గానూ సందేశాన్ని పాస్ చేసినట్లు అయింది. కిస్సిక్ పాటకు తొలుత మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఫుట్ ట్యాపింగ్ ట్యూన్స్ - ఆకట్టుకునే సాహిత్యం తో చార్ట్ బస్టర్ అయింది.