కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అసాధారణంగా ఉందనడానికి ఇదే నిదర్శనం. ఏడాది క్రితం ప్రారంభమైన మహమ్మారీ వైరస్ ఇప్పటికీ వేధిస్తూనే ఉంది. ఇటు సామాన్యులు అటు సెలబ్రిటీలు అనే తేడా ఏం లేదు. సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కోవిడ్ భారిన పడుతున్నారు.
సెకండ్ వేవ్ లో పలువురు టాప్ సెలబ్రిటీలకు కరనా సోకడంతో అభిమానుల్లో కలవరం మొదలైంది. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి.. చరణ్ కి కూడా కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ .. అభిషేక్ .. ఐశ్వర్యారాయ్ లాంటి పెద్ద స్టార్లకు కోవిడ్ సోకగా వీరంతా చికిత్సతో కోలుకున్నారు.
ఇటీవలే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఆర్.మాధవన్ కి కోవిడ్ సోకగా ప్రస్తుతం స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. వీరితో పాటు మరో సీనియర్ నటుడు పరేష్ రావల్ కూడా కోవిడ్ భారిన పడ్డారు. ప్రస్తుతం వీరంతా వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నారు.
తాజా సమాచారం మేరకు క్రికెట్ గాడ్ .. టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ కి కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. సచిన్ స్వయంగా సోషల్ మీడియాలో ఆ సంగతిని తెలిపారు. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని తనను తాను క్రమం తప్పకుండా పరీక్షించుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు COVID-19 కి పట్టుబడ్డానని తెలిపారు.
నాకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ఇంట్లో ఇతరులందరికీ నెగెటివ్ అని తేలినట్టు సచిన్ వెల్లడించారు. గృహనిర్భంధంలో ఉన్న సచిన్ వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలను అనుసరిస్తున్నారు. తనకు సహకరిస్తున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులకు అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సచిన్ సూచించారు.