సినిమా 24 శాఖలు వేటికవే ఆఫీసుల్ని రెడీ చేసుకున్నాయి. కార్మికుల కోసం ఫెడరేషన్ కార్యాలయం ఉంది. అలాగే దర్శకుల కోసం దర్శకసంఘం ఆఫీస్.. రచయితల కోసం రచయితల సంఘం ఆఫీస్ ఉన్నాయి. ఇక తెలుగు ఫిలింఛాంబర్ .. నిర్మాతల మండలి.. మూవీ ఆర్టిస్టుల సంఘం.. రామానాయుడు కళా మండపం ఇవన్నీ ఫిలింనగర్ నడిబొడ్డున ఉన్నాయి.
వీటన్నిటికీ ధీటుగా ఫిలింనగర్ లో మణిమాణిక్యంలా ఒదిగిపోయింది FNCC. దీనిని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ గా పిలుస్తారు. అయితే
FNCC నిర్మాణం వెనక ఉన్న బిగ్ హ్యాండ్స్ ఎవరు? అన్నది కొందరికే తెలుసు. నాటి మేటి హీరోలు దర్శకనిర్మాతల కృషి దీని వెనక దాగి ఉందని ఇప్పుడు ఎఫ్.ఎన్.సి.సి నూతన సంవత్సర (2023) వేడుకల్లో సీనియర్ నటుడు బాబూ మోహన్ వెల్లడించారు.
తాను ఎఫ్.ఎన్.సి.సి ప్రారంభమైన కొత్తలో తొలి 50 మంది సభ్యుల్లో ఒకడిగా ఉన్నానని బాబు మోహన్ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తనకు క్లబ్ లలో సభ్యత్వంపై అంతగా ఆసక్తి లేదని బాబు మోహన్ స్కిప్ కొట్టేయాలని చూడగా.. అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవి కల్చరల్ సెంటర్ ఆవశ్యకతను తనకు వివరించి ప్రధాన సభ్యుడిని చేశారని బాబూ మోహన్ తెలిపారు. ఎఫ్.ఎన్.సీ.సీకి అందరం కలిసి కొమ్ము కాయాలని మెగాస్టార్ తనతో అన్నారని కూడా గుర్తు చేసుకున్నారు. తాను రూ.50 వేలు కల్చరల్ సెంటర్ సభ్యత్వం కోసం చెల్లించి చేరానని వెల్లడించాడు. దిగ్గజాలు కొలువుండే ఎఫ్.ఎన్.సీ.సీలో తాను కూడా సభ్యుడినయినందుకు ఆనందంగా ఉందని అన్నారు. హైదరాబాద్ లో ఒక రామోజీ ఫిలింసిటీ ఎలానో ఇప్పుడు ఎఫ్.ఎన్.సి.సి అలా ఎదిగిందని కూడా బాబు మోహన్ కితాబిచ్చారు.
అంతేకాదు.. 2022 తీపి చేదుల మిశ్రమం. తనకు ఎంతో సన్నిహితులైన తనను అభిమానించే ముగ్గురు పెద్ద స్టార్లను కోల్పోయామని బాబు మోహన్ సంస్మరించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తనని చూడగానే పడి పడి నవ్వే వారని అంతగా తన హాస్యాన్ని ఇష్టపడేవారని బాబు మోహన్ గుర్తు చేసుకున్నారు.
అలాగే రెబల్ స్టార్ కృష్ణం రాజు.. కైకాల సత్యనారాయణ వంటి సీనియర్లకు తానంటే ఎంతో ఆప్యాయత అని కూడా బాబు మోహన్ తెలిపారు. ఈ వేదికపై ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు ఆది శేషగిరిరావు-తమ్మారెడ్డి భరద్వాజ- ఏడిద శ్రీరామ్- రోజా రమణి- విజయ్ చందర్- కె.మురళీమోహన్ రావు- ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి- మోహన్ వడ్లపట్ల తదితరులు వేడుకలో పాల్గొన్నారు. ఈ వేదికపై మంగ్లీ సిస్టర్స్ గానం అలరించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View