చిన్న సినిమా కిల్ అవుతోందని కొన్ని దశాబ్ధాలుగా వింటోన్న మాట. రిలీజ్ కి సరిగ్గా థియేటర్లు ఇవ్వకపోవడం..థియేటర్ వ్యవస్థలో మోనోపలి.. ఆనలుగురు చేతుల్లోనే థియేటర్లు లాక్ అయి ఉండటం సహా పలు కారణాలతో చిన్న సినిమాకి సరైన ప్రోత్సాహం లభించని మాట వాస్తవం. దీనిపై చిన్న నిర్మాతలు ఎన్నోసార్లు ఛాంబర్ ముందు బైఠాయించడం.. ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకోవడం సైతం జరిగింది.
కానీ వ్యవస్థలో ఇంచుకూడా మార్పాలేదు. అగ్రతాంబూలం ఎప్పుడూ అగ్ర హీరోల సినిమాలకేనని ఎన్నోసార్లు రుజువైంది. ఇప్పటికీ అలాగే జరుగుతోంది. దీంతో చిన్న సినిమాల నిర్మాణం గతంతో పోల్చుకుంటే బాగా పోయింది. తాజాగా చిన్న సినిమా ని ఉద్దేశించి నిర్మాత చదరవలవాడ శ్రీనివాసరావు ఓ సినిమా వేడుక సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసారు.
``చిన్న సినిమాకి మనుగడ కరువైంది. సినిమా ఇండస్ట్రీ లో ఎల్ఎల్‌పి అనే క్యాన్సర్ మొదలైంది. చిన్న సినిమాలకి యాడ్స్ ఇవ్వాలన్నా వాళ్ళకి కమీషన్ ఇవ్వాలి. ఎల్ఎల్ పి అంటే మా సాటి నిర్మాతలే. ఒక నిర్మాత సినిమా తీస్తే ఇంకో నిర్మాత కి కమీషన్ ఇవ్వాలి. ప్రపంచంలో ఎక్కడా ఇలా ఉండదు.
సినిమా ఇండస్ట్రీ లో ఫిలిం ఛాంబర్.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ రెండే వెల్ విషేర్స్. ఇటీవల జరిగిన సమ్మె విషయం కూడా ఛాంబర్ ద్వారా రెండు గంటల్లో పరిష్కారం అయింది’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. నిర్మాతలు నిర్మాతకి కమీషన్ ఇవ్వడం అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. చదలవాడ ఓ కొత్త పాయింట్ ని రెయిజ్ చేసినట్లు కనిపిస్తుంది.
చిన్న సినిమాల నిర్మాణమే కష్టమవుతోన్న నేపథ్యంలో మరో నిర్మాతకు కమీషన్ ఇచ్చి సినిమాలు చేయడం..వాటిని రిలీజ్ చేయటం అంటే అషామాషీ కాదు. నిర్మాతల మధ్య ఎల్ ఎల్ పీ విషయంలో క్లారిటీ మిస్ అవుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో ఇదే నిర్మాత థియేటర్ల అంశంపై నా చాలా సందర్భాల్లో చిన్న నిర్మాతలకు మద్దతుగా స్పందించిన సంగతి తెలిసిందే.