లోఫర్ పై హాలీవుడ్, బాలీవుడ్ ఎఫెక్ట్

Update: 2015-12-17 03:59 GMT
ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ అయిపోయింది వరుణ్ తేజ్ నటించిన లోఫర్. సాధారణంగా శుక్రవారం వచ్చే సినిమాని.. ఒక రోజు ముందే విడుదల చేస్తున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాధ్. తెలుగు రాష్ట్రాల్లో మరే భారీ చిత్రం పోటీ లేకపోయినా.. ఓవరాల్ గా అయితే లోఫర్ కు పోటీ తప్పడం లేదు.

ముఖ్యంగా యూఎస్ లో లోఫర్ షో ఒక రోజుకే పరిమితం కానుంది. ఈ మూవీ రిలీజ్ అయిన మరుసటి రోజునే, అంటే డిసెంబర్ 18న "స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్" రిలీజ్ అవుతోంది. ఈ హాలీవుడ్ సినిమాని ఉత్తర అమెరికాలోనే 4,500 థియేటర్లలో భారీ రిలీజ్ చేస్తున్నారు. స్టార్ వార్స్ సిరీస్ లో భాగంగా వస్తున్న లేటెస్ట్ మూవీపై అక్కడ అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మరోవైపు షారూక్ ఖాన్ - కాజోల్ నటించిన దిల్ వాలే - రణ్ వీర్ సింగ్-దీపికల బాజీరావు మస్తానీ చిత్రాలు కూడా అదే రోజున వస్తున్నాయి. ఈ మూడు చిత్రాలకు థియేటర్స్ సెట్ చేయడంతో.. లోఫర్ కు చాలా తక్కువ స్క్రీన్స్ మాత్రమే దక్కాయి.

మొదటి రోజు మినహాయించి.. వీకెండ్స్ లో భారీగా ప్రదర్శించే అవకాశం లేకపోయింది. అమెరికా మార్కెట్ లో వీకెండ్ కలెక్షన్స్ చాలా ముఖ్యం. కానీ ఆ బెనిఫిట్ దక్కించుకునే అవకాశం లోఫర్ కు లేదని తేలిపోయింది. ఆల్ మోస్ట్.. యూఎస్ బాక్సాఫీస్ నుంచి ఈ మూవీకి వచ్చే మొత్తం చాలా తక్కువ అంటున్నారు ట్రేడ్ పండిట్స్.
Tags:    

Similar News