కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు.. హీరో నిఖిల్ గౌడ వివాహంను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం రామనగర జిల్లాలో దాదాపు 100 ఎకరాల విశాలమైన స్థలంలో భారీ కళ్యాణ మండపం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్ కార్యకర్తలను దాదాపుగా అయిదు లక్షల మందిని ఆహ్వానించి నిఖిల్ గౌడ వివాహంను చేయాలని కుమారస్వామి భావించాడు. కాని కరోనా విపత్తు నేపథ్యంలో లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా నికిల్ గౌడ పెళ్లి అత్యంత సింపుల్ గా ఒక ఫామ్ హౌస్ లో నిర్వహించేందుకు సిద్దం అయ్యారు.
నికిల్ గౌడ.. రేవతి వివాహంను బెంగళూరు సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించబోతున్నారు. రేపు ఈ వివాహ వేడుక జరుగబోతుంది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం నుండి కుమారస్వామి అనుమతులు పొందినట్లుగా తెలుస్తోంది. పెళ్లిలో సోషల్ డిటెన్స్ ను పాటించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ లు ధరించేలా చూసుకుంటామని చెప్పి పెళ్లికి అనుమతులు తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
అమ్మాయి, అబ్బాయి తరపున బంధువులు ఇంకా మిత్రులు కలిసి కేవలం 100 మంది లోపు ఉండేలా ప్రభుత్వం ఆదేశించిందట. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ జన సంచారం జరగకుండా ఉండేందుకు దాదాపుగా 50 మంది సెక్యూరిటీ ఇవ్వబోతున్నారట. అంతా బాగుంటే గత రెండు మూడు రోజుల నుండే పెళ్లి హంగామా మొదలయ్యేది. కాని కరోనా కారణంగా పెళ్లి గుట్టు చప్పుడు కాకుండా దొంగ పెళ్లి మాదిరిగా చేయాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల నుండి బయట పడ్డ తర్వాత బెంగళూరు లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించిన కుమారస్వామి పెళ్లికి రాకుండా కార్యకర్తలు ఇంట్లోనే ఉండి వధువరులను ఆశీర్వధించాంటూ విజ్ఞప్తి చేశాడు. ఎంతో మంది పెళ్లిలు వాయిదా వేసుకుంటూ ఉంటే నిఖిల్ మాత్రం ఈ విపత్తు సమయంలో పెళ్లి చేసుకోవడంను కొందరు తప్పుబడుతున్నారు.