యూనివర్సల్ కమల్ హాసన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ `విక్రమ్`. కమల్ హాసన్ దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత నటించిన ఈ మూవీ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. కమల్ కెరీర్ లోనే చాలా రోజుల తరువాత అత్యధిక వసూళ్లని రాబట్టిన కల్ట్ క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ గా నిలిచింది. నాలుగేళ్ల విరామం తరువాత కమల్ పర్ ఫెక్ట్ మూవీతో ఫర్ ఫెక్ట్ కంబ్యాక్ అయ్యారని అంత ప్రశంసలు కురిపించారు.
లోకేష్ కనగరాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్, నరేష్ కీలక పాత్రల్లో నటించారు. సినిమా క్లైమాక్స్ లోని చివరి ఐదు నిమిషాల్లో రోలెక్స్ గా కనిపించి హీరో సూర్య అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది సౌత్ ఇండస్ట్రీగా మారిన లోకేష్ కనగరాజ్ త్వరలో దళపతి విజయ్ తో నెక్స్ట్ మూవీని చేయబోతున్నాడు. విజయ్ 67వ ప్రాజెక్ట్ గా తెరపైకి రానున్న ఈ సినిమాని లలిత్ కుమార్ నిర్మించబోతున్నారు.
`మాస్టర్` తరువాత విజయ్ తో కలిసి లోకేష్ కనగరాజ్ చేయనున్న సినిమా కావడం, లోకేష్ యూనివర్స్ లో భాగంగా ఈ మూవీని తెరకెక్కించబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దళపతి 67పై అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ యాక్షన్ డ్రామాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. అంతే కాకుండా ఇందులోని కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆ క్యారెక్ట్ లో సంజయ్ దత్ కాకుండా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ సంప్రదిస్తున్నారని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అదే నిజమైతే.. కమల్ కోసం రోలెక్స్ లా సూర్యని దించేసిన లోకేష్ కనగరాజ్ ..విజయ్ కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ ని ఏ పాత్రలో తెరపైకి తీసుకొస్తాడో అని అప్పుడే ఫ్యాన్స్ చర్చమొదలు పెట్టారు. ఇదిలా వుంటే ఈ మూవీలో విజయ్ కి జోడీగా త్రిష, సమంత నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.
కానీ దీనిపై దర్శకుడు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదిలా వుంటే ఈ మూవీ ఈ ఏడాది ఎండింగ్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల దశలో వున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాల్ని మేకర్స్ త్వరలోనే వెల్లడించే అవకాశం వుంది.