బ్లాక్ బస్టర్ హిట్ లకు సీక్వెల్స్ చేయాలని చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. ఆ విషయాన్ని మూవీ ఎండింగ్ లో చెప్పేస్తుంటారు కూడా. కానీ `సోగ్గాడే చిన్నినాయన` మూవీకి మాత్రం సీక్వెల్ చేస్తామని కానీ, సీక్వెల్ వుంటుందని కానీ నాగార్జున వెల్లడంచలేదు. సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టడమే కాకుండా కింగ్ నాగార్జున కెరీర్ లో అత్యధిక వసూళ్లని సొంతం చేసుకున్న మూవీగా రికార్డు సాధించింది.
ఈ మూవీకి సీక్వెల్ గా `బంగార్రాజు` తెరకెక్కిన విషయం తెలిసిందే. 2016లో వచ్చిన `సోగ్గాడే చిన్నినాయనకు` సీక్వెల్ చేయడానికి హీరో నాగార్జున, డైరెక్టర్ కల్యాణ్ కృష్ణకు ఐదేళ్లు పట్టింది. మరి దీనికి సీక్వెల్ వుంటుందా? వుంటే దీని కోసం ప్రేక్షకులు ఎన్నేళ్లు వేయిట్ చేయాలా అనే చర్చ మొదలైంది. ముందు `సోగ్గాడే చిన్ని నాయన` చిత్రానికి సీక్వెల్ చేయాలని ప్లాన్ చేసుకోలేదు. ఆ ఆలోచనే కింగ్ నాగ్, కల్యాణ్ కృష్ణలకు లేదంట.
సినిమా అనుకున్న దానికి మించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడం వల్లే దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల కు సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చిందని, వచ్చిన వెంటనే ఆ ఐడియాను హీరో నాగార్జునకు చెప్పారట. అయితే నాగ్ మంచి కథ చేసి పట్టుకురమ్మని చెప్పడం, కల్యాణ్ కృష్ణ కురసాల చేసిన కథ నాగ్ కు నచ్చకపోవడంతో ఏళ్లు గడుస్తూ వచ్చాయి.
ఫైనల్ గా గత ఏడాది స్క్రిప్ట్ నచ్చడంతో నాగార్జున `బంగార్రాజు`కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ తరువాతే మూవీ చక చకా పట్టాలెక్కేసింది. కేవలం 90 రోజుల్లో ఈ మూవీని పూర్తి చేశారు. ఈ సంక్రాంతికి జనవరి 14న థియేటర్లలో కి తీసుకొచ్చేశారు. సినిమా టాక్ సూపర్ అని వినిపిస్తోంది. ఈ నేఫథ్యంలో మరి దీనికి సీక్వెల్ వుంటుందా? .. వుంటే మళ్లీ ఎంత కాలం ఆగలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే నాగార్జున మాత్రం `బంగార్రాజు` ఫ్రాంచైజీ ఆగదని, ఏ టైమ్ లో వచ్చినా బంగార్రాజు హంగామా బంగార్రాజుదే అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అంటే `బంగార్రాజు` ఫ్రాంచైజీలు వచ్చేస్తూ వుంటాయన్న మాట. కానీ ఈ సారి సీక్వెల్ కోసం `బంగార్రాజు` తరహాలో మరో రెండు మూడేళ్లు ఆగాల్సిందేనా లేక వేయిటింగ్ లేకుండానే వచ్చే ఏడాది నాగ్ మరో కొత్త సీక్వెల్ తో సంక్రాంతికి సందడి చేస్తారా? అన్నది అభిమానుల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.