లేట్ వయసులో భలే ఆఫర్ వచ్చిందే

Update: 2017-03-08 06:31 GMT
ఇండస్ట్రీలో కొనసాగుతున్నపుడు బ్రాండ్లను చేజిక్కించుకోవడం మహా క్లిష్టమైన విషయం. టాప్ బ్రాండ్స్ అన్నీ దాదాపు టాప్ స్టార్ల వెనకే పడుతుంటాయి. అలాంటిది కెరీర్ ముగిసిపోయిన దశాబ్దం తర్వాత మళ్లీ ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు అంబాసిడర్ గా పని చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.

ట్వింకిల్ ఖన్నా ఇప్పుడా అరుదైన ఫీట్ సాధించింది. లేటు వయసులో కూడా లోరియల్ బ్రాండ్ కు ప్రచారం చేసే బాధ్యతలు చేపట్టింది. తాజాగా బంబోలిమ్ లో జరిగిన ప్రొఫెషనల్ ఇండియన్ హెయిర్ డ్రెసింగ్ అవార్డ్స్ కార్యక్రమంలో ట్వింకిల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. సెలూన్.. హెయిర్ డ్రెసింగ్ ఉత్పత్తులకు ట్వింకిల్ ఖన్నా ప్రచారం చేయనుంది. ఈ బ్రాండ్ కు ప్రచారం చేస్తున్న ఐశ్వర్యారాయ్.. సోనమ్ కపూర్ ల సరసన చేరింది. ఇంతగా ఈమెకు బంపర్ ఆఫర్ దక్కడానికి కారణం ఇప్పటికీ ఆమె కెరీర్ మరో రకంగా కొనసాగుతుండడమే.

యాక్ట్రెస్ గా కెరీర్ ముగిసిపోయినా.. ఇప్పుడు రైటర్ గా తన కెరీర్ ని పీక్ స్టేజ్ లోకి తీసుకెళ్లింది ట్వింకిల్ ఖన్నా. వరుసగా బుక్స్ లాంఛ్ చేసేస్తూ.. హ్యాపెనింగ్ బ్యూటీ అయిపోయింది. అందుకే ఇంత లేటు వయసులో కూడా హాటుహాటుగా కనిపించే అవకాశం చిక్కింది.
Tags:    

Similar News