'వి' కాపీ ఇంద్రగంటికి తెలియకుండా జరిగిందా?

Update: 2020-09-11 00:30 GMT
నాని 25వ సినిమా 'వి' తాజాగా ఓటీటీ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చింది. దానికి తోడు సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ తమిళ హిట్‌ మూవీ 'రాక్షసన్‌' నుండి మక్కీకి మక్కీ ఎత్తిసినట్లుగా ఉంది. 'వి' సినిమా షూటింగ్‌ సమయంలోనే సంగీత దర్శకుడు థమన్‌ ఈ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చాడట. అయితే ఆ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ను రాక్షసుడు నుండి థమన్‌ ఎత్తి వేశాడు అంటూ ఇంద్రగంటి కనిపెట్టలేక పోయాడు అంటూ కొందరు అంటున్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే స్వయంగా ఇంద్రగంటి తనకు అలాంటి బీజీ కావాలని థమన్‌ ను కోరాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు కోరినట్లుగా సంగీత దర్శకుడు బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చాడంటున్నారు.

రాక్షసన్‌ సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మంచి మార్కులు పొందింది. తన సినిమా కథకు అది బాగా సూట్‌ అవుతుందని ఇంద్రగంటి భావించాడని అందుకే దాన్ని మార్చి 'వి' సినిమాలో పెట్టేద్దాం అంటూ థమన్‌ తో అన్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే థమన్‌ దాన్ని పెద్దగా మార్చకుండానే నేరుగా పెట్టేశాడు. ఇంద్రగంటి రాక్షసన్‌ బీజీ తరహాలో కవాలని అన్నాడు కనుక ఆయన దాన్ని గుర్తించ లేక పోయాడంటూ కొందరు కామెంట్స్‌ చేస్తూ ఉండగా మరి కొందరు మాత్రం కనీసం దిల్‌ రాజు అయిన ఈ విషయంలో కాస్త శ్రద్ద చూపిస్తే బాగుండేది కదా అంటున్నారు.

మొత్తానికి ఎక్కడో ఏదో పొరపాటు జరగడమో లేదంటే కావాలని చేయడమో చేశారు కాని తమ అభిమాన హీరో నాని పరువు తీశారంటూ నాచురల్‌ స్టార్‌ నాని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాని ప్రతిష్టాత్మక 25వ సినిమాకు ఇలా జరగడం విచారకరం అంటూ అభిమానులు నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News