ప్రేమ ఎంత మ‌ధురం

Update: 2018-11-16 04:16 GMT
ప్రేమ ఎంత మ‌ధురం .. ప్రియురాలు అంత క‌ఠినం!  ప్రేయ‌సీ ప్రియుల మ‌ధ్య అన్నీ కుదిరితే ఆ ప్రేమ మ‌ధుర‌మే. కుద‌ర‌క‌పోతే.. ఆ ప్రేయ‌సి అల‌క‌బూనితే ఆ క‌థే వేరుగా ఉంటుంది. కానీ ఈ ల‌వ్ క‌పుల్‌ ని చూస్తుంటే అస‌లు ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఇసుమంత కూడా గ్యాప్ వ‌చ్చిన‌ట్టు అనిపించ‌డం లేదు. ఇద్ద‌రి మ‌ధ్యా గాలి కూడా దూర‌నంత ద‌గ్గ‌ర‌యిపోయారు.

ఈ ఇద్ద‌రి ప్రేమ‌కు ఇప్ప‌టికే నాలుగేళ్లు. న‌య‌న్ అత‌డితో.. సాన్నిహిత్యంతో స‌హ‌జీవ‌నంలో ఉన్నా.. ఆ ఇద్ద‌రూ పెళ్లి మాట అడిగితే అస‌లు గుట్టు చెప్ప‌నే చెప్ప‌రు. బ‌హుశా న‌య‌న్ కెరీర్ విష‌యంలో అడ్డంకులు లేకుండా చూసుకోవ‌డ‌మే గేమ్ ప్లాన్ అయ్యి ఉండాలి. ఇక ద‌ర్శ‌కుడిగా విఘ్నేష్ కెరీర్ అలా సాగుతోంది. తాన సేంద్ర కూట‌మ్ ఫ్లాప్ త‌ర్వాత అత‌డికి వేరొక సినిమా లేదు. అయితే న‌య‌న్ మాత్రం కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీ.

సౌత్‌లోనే అసాధార‌ణ స్టార్ డ‌మ్‌ ని ఆస్వాధిస్తున్న న‌య‌న‌తార వ‌రుస విజ‌యాల‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ ని ప‌రుగులు పెట్టిస్తోంది. 2018-19 టాలీవుడ్ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అజిత్- విశ్వాసం, కోల‌యితిర్ కాల‌మ్ - ల‌వ్ యాక్ష‌న్ డ్రామా - ఐరా - కొట్టాయం కురుంబ‌న వంటి చిత్రాల్లో న‌య‌న్ న‌టిస్తోంది. 
Tags:    

Similar News