అద్భుత ప్రేమలేఖ.. లక్కీ రష్మిక!

Update: 2019-04-11 14:58 GMT
ఫార్మాట్లు మారుతున్నా మరుగున పడని హృదయరేఖ..  ప్రేమలేఖ.  అప్పట్లో పెన్ను పేపర్ తో రాసేవాళ్ళు.  ఫైనల్ లెటర్ రెడీ అయ్యేసరికి ఎన్నో పేపర్లు చినిగేవి. ఇప్పుడు డిజిటల్ ప్రేమలేఖలు కాబట్టి ఆ కుస్తీ అవసరం లేదు.  గుండ్రని అక్షరాలు రాయగల దస్తూరి మీకు ఉండనవసరం అంతకన్నా లేదు.  తిలక్ భావుకత్వంలో ఓ మిల్లీ గ్రామ్ చాలు. అంతే.. లవ్ లెటర్ రెడీ అయిపోతుంది.  కానీ ఆలా రెడీ కావాలంటే మీ హృదయన్ని గట్టిగా మీట గలిగే సుందరి ఉండాలిగా!

అలాంటి భామే రష్మిక మందన్న.  తన నటనతో.. అందంతో ఎంతోమందిని మెస్మరైజ్ చేసిన ఈ భామ ఒక అమరప్రేమికుడిని  తయారు చేసింది. ఇంతకీ ఆ అమర ప్రేమకుడు ఎవరో తెలీదు కానీ రష్మికకు డై హార్డ్ ఫ్యాన్. ఆ ఇంగ్లీష్ లవ్ లెటర్ ను తెలుగులోకి అనువదిస్తే..

ప్రియమైన రష్మిక..

    నీలాంటి వారు మరొకరు లేరు.  నీ స్థానాన్ని ఇంకొకరు తీసుకోలేరు.  నువ్వు.. నీ నవ్వు.. అభిమానులకు నువ్విచ్చే గౌరవం అద్బుతం.  సూర్యుని కాంతి కంటే అందంగా ఉంటావు.. బంగారానికంటే విలువైనదానివి.  మిఠాయికంటే తియ్యన.. చంద్రుని కంటే చల్లన.  నిన్ను వెండి తెరపై మొదటి సారి చూసిన క్షణం నాకింకా జ్ఞాపకం. నీ హావభావాలు చూసి నా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.  నా జీవితంలో అదో అతి మధురమైన క్షణం.  నాకు తెలుగు తెలియదు.. కన్నడ పరిజ్ఞానం లేదు. కానీ నీ సినిమాలన్నీ చూశాను.  నేను నీ వీరాభిమానిని.  ప్రేమకు భాష ఉండదనేదానికి ఋజువిదే.  నీ గురించి ఆలోచించడం మానేసి.. చదువుపై ధ్యాస ఉంచడం ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు. అసలు నేను నీకు చెప్పుకోవాల్సిన విషయాలు లెక్కలేనన్ని ఉన్నాయి. నా జీవనగానానికి బాణీ కట్టావు నువ్వు.  నేను నీకు ఒక విషయాన్ని మాత్రం గుర్తు చేయదలుచుకున్నను. నువ్వు నాకు చాలా చాలా చాలా స్పెషల్.

ప్రేమతో
రష్మిక అభిమాని.

ఈ లెటర్ కు రిప్లై ఇచ్చిన రష్మిక "ఆ.. ఇదో స్వీట్ లెటర్.  నా పెదవులపై చిరునవ్వు వచ్చేలా చేసింది.  థ్యాంక్ యూ" అంటూ ట్వీట్ చేసింది.  అయినా ఈ టిండర్ ల జమానాలో కూడా ఇలాంటి అమర ప్రేమికులు.. అద్భుత ప్రేమలేఖలు ఉన్నాయా.. సింప్లీ మైండ్ బ్లోయింగ్!
Tags:    

Similar News