ఉక్రెయిన్ లో ప్రేమకథ .. భారత్ రాలేకపోతున్న హీరోయిన్!

Update: 2022-04-27 01:30 GMT
ఉక్రెయిన్ పై రష్యా  యుద్ధం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ, చాలామంది యుద్ధం జరగకపోవచ్చని అనుకున్నారు. అందువల్లనే అక్కడ చిక్కుకుపోయారు. ఆల్రెడీ అక్కడే ఉంటూ ఆ యుద్ధంలో చిక్కుకుపోయినవాళ్లు కొందరైతే, అనేక పనుల మీద అక్కడికి వెళ్లి చిక్కుబడిన వాళ్లు మరికొందరు. అలా సినిమా షూటింగు కోసం వెళ్లి అక్కడే ఉండిపోయిన వాళ్లున్నారు. 'లవ్ ఇన్ ఉక్రెయిన్' సినిమా హీరోయిన్ ఏలిజా అక్కడే ఉండిపోయింది.

నితిన్ కుమార్ గుప్తా దర్శకత్వంలో 'లవ్ ఇన్ ఉక్రెయిన్' సినిమా రూపొందుతోంది. ఈ బాలీవుడ్ సినిమాతో విపిన్ కౌశిక్  హీరోగా పరియమవుతున్నాడు. ఉక్రేనియన్ అమ్మాయి - భారత్ అబ్బాయి మధ్య నడిచే అందమైన ప్రేమకథ ఇది. ఈ సినిమాను ఉక్రెయిన్ లో చిత్రీకరిస్తూ ఉండగా యుద్ధం మొదలైంది.

భయంకరమైన ఆ అనుభావం గురించి దర్శకుడు నితిన్ కుమార్ గుప్తా ప్రస్తావించారు. 'లవ్ ఇన్ ఉక్రెయిన్' సినిమా కథ అంతా కూడా ఉక్రెయిన్ నేపథ్యంలోనే నడుస్తుంది. అందువలన ఆ సినిమాను అక్కడే చిత్రీకరించాలి.

ఈ కారణంగానే మా టీమ్ అంతా కలిసి ఉక్రెయిన్ వెళ్లాము. మేము అక్కడికి వెళ్లినప్పుడు వాతావరణం బాగానే ఉంది.   ఎలాంటి ఇబ్బంది లేకుండా 90 శాతం చిత్రీకరణను జరిపాము. ఆ సమయంలో యుద్ధానికి సంబంధించిన వార్తలు వెలువడటం మొదలైంది. అయితే యుద్ధం జరగకపోవచ్చు .. పరిస్థితులు వెంటనే చల్లబడతాయని అనుకున్నాము. కానీ అందుకు భిన్నంగా యుద్ధం మొదలైపోయింది. అలాంటి పరిస్థితుల్లో అనుమతుల కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించవలసింది.

అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాకు అనుమతులు. రక్షణ కోసం కొంతమంది సిబ్బందిని కూడా ఇచ్చారు. ఒకవైపున యుద్ధం జరుగుతూ ఉండగానే మరో వైపున షూటింగు కానిచ్చేశాము.

ఆ తరువాత యుద్ధం తీవ్రత పెరిగే సమయానికి మేమంతా అక్కడి నుంచి బయటపడగలిగాము. అక్కడి ఆర్టిస్టులు అక్కడే ఉండిపోయారు. ఈ సినిమా మే 27వ తేదీన విడుదల కానుంది. అందువలన హీరోయిన్ తో పాటు అక్కడి ఆర్టిస్టులను ప్రమోషన్ కి రప్పించాలని ప్రయత్నిస్తుంటే కుదరడం  లేదు" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News