యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ''లవ్ స్టోరీ''. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం మ్యాజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 58 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి.. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు కుదేలైన సినీ పరిశ్రమకు ఊపిరిపోసింది.
అంతేకాదు పాండమిక్ తర్వాత యూఎస్ఏ లో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన మొదటి సినిమాగా 'లవ్ స్టోరి' రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నమోదైంది. వెండితెర మీద భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ.. బుల్లితెరపై కూడా హవా కొనసాగించింది.
ఇటీవల 'స్టార్ మా' ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా 'లవ్ స్టొరీ' సినిమా ప్రసారం అయింది. బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ సాలిడ్ టీఆర్పీ రాబట్టింది. 18.01 రేటింగ్ పాయింట్స్ తో స్మాల్ స్క్రీన్ పై కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
'లవ్ స్టొరీ' మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. మ్యాజికల్ బ్లాక్ బస్టర్ చిన్న స్క్రీన్ లలో కూడా అద్భుతమైన విజయం సాధించింది అని తెలిపారు. ఈ సందర్భంగా నాగచైతన్య ట్వీట్ చేస్తూ.. ''మరోసారి మీ ప్రేమకు ధన్యవాదాలు! 'స్టార్ మా' లో 'లవ్ స్టోరీ' టెలివిజన్ ప్రీమియర్ 18+ టీఆర్పీ సాధించింది'' అని పేర్కొన్నారు.
కాగా, 'లవ్ స్టోరీ' చిత్రంలో కులవివక్షత మరియు అమ్మాయిలపై ప్రస్తుతం జరుగుతున్న లైంగిక వేధింపులు వంటి అంశాలను ''లవ్ స్టొరీ'' చిత్రంలో ప్రస్తావించారు. నాగచైతన్య - సాయి పల్లవిల నటనతో పాటుగా పవన్ సీహెచ్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై 'లవ్ స్టొరీ' చిత్రాన్ని రూపొందించారు. నారాయణ దాస్ కె. నారంగ్ - పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో రాజీవ్ కనకాల - దేవయాని - ఈశ్వరి రావు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇకపోతే ప్రస్తుతం 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా విశేష ఆదరణ దక్కించుకుంటోంది.