దేశంలో కోవిడ్ కారణంగా విడుదలకు సిద్ధమైన సినిమాలు వరుసగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా వేయడం అయితే జరిగింది కానీ మళ్లీ రిలీజ్ ఎప్పుడనే విషయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అసలే కోవిడ్ సెకండ్ వేవ్ అనేది వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇలాంటి తరుణంలో అక్కినేని హీరో నాగచైతన్య రిలీజ్ కు రెడీ చేసిన మూవీ గురించి చర్చలు జరుగుతున్నాయి. నిజానికి నాగచైతన్య నటించిన 'లవ్ స్టోరీ' మూవీ ఆల్రెడీ కరోనా కారణంగానే గతేడాది నుండి ఈ ఏడాదికి వాయిదాపడింది. తీరా ఇప్పుడు విడుదలకు అన్నివిధాలా రెడీ అయిపోయాక కరోనా మళ్లీ వచ్చి వాయిదా పడేలా చేసింది.
ఈ ఏడాది లవ్ స్టోరీ మూవీని ఏప్రిల్ 16న విడుదలకు రంగం సిద్ధం చేసుకున్నారు మేకర్స్. కానీ సినిమా రిలీజ్ పై ప్రేక్షకులు ఓ రేంజిలో ఎక్సపెక్ట్ చేశారు. నాగచైతన్య కెరీర్లో ఈ సినిమా క్రియేట్ చేసినంత బజ్ ఏ సినిమా చేయలేదు. ఇప్పటికి ఇండస్ట్రీ దృష్టి 'లవ్ స్టోరీ' పైనే ఉంది. కానీ ఆ క్రెడిట్ అంతా చైతూ ఒక్కడిదే కాదు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరోయిన్ సాయిపల్లవి సినిమాకు ఆ రేంజిలో బజ్ క్రియేట్ అయ్యేందుకు కారణం అయ్యారు. అయితే ఏప్రిల్ లో వాయిదా పడగానే లవ్ స్టోరీ సినిమా మే నెలలో విడుదల కాబోతుందని టాక్ బాగా నడిచింది. కానీ సెకండ్ వేవ్ అనేది మళ్లీ దెబ్బేసింది. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితి తగ్గుముఖం పడుతుండటంతో లవ్ స్టోరీ రిలీజ్ పై ఆసక్తి పెరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. లవ్ స్టోరీ మూవీ మరో కొత్త డేట్ కు షిఫ్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినిమాలోని పాటలు అన్నికూడా సినిమా పై భారీ అంచనాలు సెట్ చేసాయి. ముఖ్యంగా సారంగదరియా సాంగ్ తెలుగు రాష్ట్రాలలో ఓ ఊపు ఉపేస్తోంది. కానీ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం అయితే లవ్ స్టోరీ మూవీ ee ఏడాది ఆగష్టులో రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఇప్పటికే సినిమా అన్నివిధాలా సిద్ధం అయిపోయింది. ఆగస్టు వరకు పరిస్థితి మాములుగా మారి థియేటర్స్ ఓపెన్ చేస్తే వెంటనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతం నాగచైతన్య డైరెక్టర్ విక్రమ్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. చూడాలి మరి ఈసారి నాగచైతన్య అదృష్టం ఎలా ఉందో!