హీరోతో ప్రేమ.. నిశ్చితార్థం.. బ్రేకప్ పై నోరు విప్పిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ లో లవ్ స్టోరీస్ చాలా కామన్. లవ్ స్టోరీస్ తో పాటు బ్రేకప్ కూడా అంతే కామన్ అనే విషయం తెల్సిందే. లవ్.. బ్రేకప్ లు టాలీవుడ్ లో ఇప్పటివి ఏమీ కాదు. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కనిపిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గతంలో రవీనా టాండన్ తో ప్రేమలో ఉన్న విషయం ఉత్తరాది ప్రేక్షకులందరికి కూడా తెలుసు. ఇద్దరు కూడా సినిమాల్లో అప్పుడప్పుడే స్టార్ డం దక్కించుకుంటున్న సమయంలో ప్రేమ పుట్టింది. ఇద్దరు కలిసి మొహ్రా సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఇద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. కెరీర్ లో పీక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి అంటే ఆ తర్వాత ఇబ్బందేమో అని అక్షయ్ కుమార్ అనుకున్నాడు. అయినా కూడా రవీనా టాండన్ తో పెళ్లికి సిద్దం అయ్యాడు. ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్ గా నిశ్చితార్థం జరిగిందట. నిశ్చితార్థం జరిగిన తర్వాత రవీనాతో పెళ్లి ని అక్షయ్ వాయిదా వేస్తూ వచ్చాడట.
నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి జరగక పోవడంపై రవీనా తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నిశ్చితార్థం తర్వాత నేను అక్షయ్ కోరిక మేరకు సినిమాలకు దూరం అయ్యాను. ఆయనతో పెళ్లి కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఆయన మాత్రం కాస్త సమయం కావాలన్నాడు. మహిళ అభిమానులు ఎక్కువ ఉన్న తాను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వారు తనకు దూరం అయ్యే అవకాశం ఉందని భయపడ్డాడు. తాను వెయిట్ చేస్తున్న సమయంలోనే అక్షయ్ ఏ సినిమా చేస్తే ఆ సినిమా లో హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. నా వరకు ఆ వార్తలు రావడంతో నేను పలు సార్లు అక్షయ్ ను అడిగాను.
ఎన్నో సార్లు ఆయనకు దూరం గా ఉండాలని భావించాను. కాని ఆయన నన్ను ఒప్పించాడు. చివరకు శిల్పాతో ఆయన ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు రావడంతో నేను తట్టుకోలేక పోయాయి. అక్షయ్ కోసం తనకు వస్తున్న సినీ ఆఫర్లను వదులుకోవాలనుకోలేదు. అందుకే మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్దం అయ్యాను. ఆ సమయంలో అక్షయ్ నా వద్దకు వచ్చి బతిమిలాడి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసినా కూడా తనకు ప్రథమ ప్రియారిటీ సినిమాలే అని చెప్పేశాను. సినిమాలు చేస్తానంటూ చెప్పడంతో నాకు అక్షయ్ దూరం అయ్యాడు అంది. అక్షయ్ ఖన్నా ఆ తర్వాత కొన్నాళ్లకు ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.