సాంగ్ టాక్: లవ్వర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో

Update: 2018-02-14 04:18 GMT
మామూలుగా కొత్త కొత్త సింగర్లను కంపోజర్లను మ్యూజిక్ డైరక్టర్లు తీసుకొస్తారు కాని.. అదేంటో కాని టాలీవుడ్ లో మాత్రం అలాంటి ఫీట్లన్నీ ఎక్కువగా స్టయిలిష్‌ స్టార్ అల్లు అర్జున్ సినిమాలోనే కనిపిస్తున్నాయి. ఇద్దరమ్మాయిలతో సినిమాలతో రన్ రన్ సాంగును ఆపాచి ఇండియన్ పాడితే.. సరైనోడులో డూడు డూడు సాంగును హార్డ్ కౌర్ తో పాడించారు. ఇప్పుడు కూడా అలాగే ఒక కొత్త గాత్రం బన్నీ కోసం హల్ చల్ చేస్తోంది.

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాకు ఆల్రెడీ విశాల్-శేఖర్ సంగీతం కంపోజ్ చేస్తున్నారంటేనే చాలా కొత్తగా అనిపించింది. అయితే గతంలో ఈ సంగీత ద్వయంలో విశాల్ మనోడి కోసం అతిలోక సుందరి (సరైనోడు) పాట పాడగా.. ఇప్పుడు విశాల్ మనోడికి కోసం ఈ లవ్వర్ ఆల్సో ఫైటర్ ఆల్సో పాట పాడేశాడు. పాటలో కొత్తదనం ఉంది. గొంతులో ఏదో తెలియని కమ్మదనం ఉంది. అలాగే మొత్తం పాట కంపోజిషన్ లో కూడా ఒక వెరైటి రిథమ్ ఉంది. ఇకపోతే ఆ లిరికల్ వీడియోను చూస్తుంటే.. పాటలో అల్లు అర్జున్ గెటప్ అదిరిపోతే.. అను ఎమ్మానుయేల్ కూడా హాటుగా కనిపిస్తోంది. వీరి మధ్యన కెమిస్ర్టీని చెప్పే పాట కావడంతో.. అది అదిరిపోయిందనే చెప్పాలి.

మొన్నామధ్యన ఫస్ట్ ఇంపాక్ట్.. తరువాత సైనిక సాంగ్.. ఇప్పుడు లవ్వర్ ఆల్సో.. వరుసగా బన్నీ మాత్రం తెగ ఇంప్రెస్ చేస్తూ వస్తున్నాయడు. అలాగే దర్శకుడు వక్కంతం వంశీ కూడా తొలి సినిమాకే చాలా వేరియషన్ చూపించడం బాగుంది. చూస్తుంటే నాగబాబు మరియు లగడపాటి శ్రీధర్ సమ్మర్లో ఈ సైనికుడితో గట్టి హిట్టే కొట్టించేలా ఉన్నారు. అది సంగతి.




Full View
Tags:    

Similar News