మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ తెలుగు రీమేక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు వచ్చేసింది. సినిమా షూటింగ్ ను ఏ క్షణంలో అయినా మొదలు పెట్టవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆచార్య సినిమా ను చిరంజీవి ముగించిన తర్వాత లూసీఫర్ సినిమా షూటింగ్ కు జాయిన్ అవ్వబోతున్నాడు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న లూసీఫర్ తెలుగు రీమేక్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో సార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. హీరోయిన్ విషయమై పలు సందర్బాల్లో పుకార్లు షికార్లు చేశాయి. ఒరిజినల్ వర్షన్ లో హీరోయిన్ పాత్ర ఉండదు. కాని తెలుగు ప్రేక్షకులకు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప సినిమా ఎక్కదు. అందుకే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా.. టాలీవుడ్ పరిస్థితులకు అనుకూలంగా.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా లూసీఫర్ ను మార్చి హీరోయిన్ పాత్రను జొప్పించడం జరుగుతుందట.
వకీల్ సాబ్ సినిమా లో ఎలా అయితే హీరోయిన్ పాత్రను క్రియేట్ చేశారో అలాగే లూసీఫర్ సినిమాలో కూడా హీరోయిన్ పాత్రను మెయిన్ కథతో సంబంధం లేకుండా క్రియేట్ చేయబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కథను ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా లూసీఫర్ లో హీరోయిన్ పాత్ర ఉంటుందని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక ఆ హీరోయిన్ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందనే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఎక్కువ శాతం మంది నయనతార అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.
చిరంజీవి కూడా ఆ పాత్రకు నయనతారను తీసుకోవాలంటూ దర్శకుడికి సూచించడం ఇప్పటికే దర్శకుడు కూడా నయనతార తో సంప్రదింపులు ప్రారంభించడం కూడా జరిగిందట. అయితే నయన తార నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని టాక్. పెద్ద ఎత్తున అంచనాలున్న లూసీఫర్ లో హీరోయిన్ పాత్ర చిన్నగానే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాంటి చిన్న పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ కావాలంటే ఆమె కాస్త ఎక్కువ పారితోషికమే డిమాండ్ చేస్తుంది. చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా నయనతార ఉంటే ఖచ్చితంగా సినిమా వెయిట్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.
చిరంజీవితో సైరా సినిమాలో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ నయనతార మళ్లీ ఆయనకు జోడీగా ఈ సినిమాలో నటించి ఆకట్టుకుంటుందేమో చూడాలి. సీనియర్ హీరోలకు ఈమద్య నయనతార మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. ఒక వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మరో వైపు సీనియర్ హీరోల సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పుతూ బిజీ బిజీగా ఉంది. ఇటీవలే ఈమె షారుఖ్ ఖాన్ తో అట్లీ చేయబోతున్న సినిమా లో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ అమ్మడు మెగాస్టార్ చిత్రంలో కనిపిస్తుందా లేదా అనేది చూడాలి. చిరంజీవి మరియు నయనతార కాంబో కోసం మళ్లీ మెగా ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. లూసీఫర్ ను మూడు నెలల్లోనే ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలోనే తెలుగు లూసీఫర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.