విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన నారప్ప ఈనెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తర్వాత అతి పెద్ద ఓటీటీ రిలీజ్ ఇది. ఇందులో ప్రియమణి కథానాయిక. తాజాగా ఓ నారప్ప లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది. ధనుంజయ్ - వరం ఈ పాటను పాడారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా మణి శర్మ సంగీతం సమకూర్చారు. ఇక ఈ వీడియో ఆద్యంతం వింటేజ్ వెంకీ లుక్ ఆకట్టుకుంది. నాటి పల్లెల్లో కుల వ్యవస్థ అంతరాన్ని చూపించేలా కథానాయికను డీగ్లామరైజ్డ్ గా ఆవిష్కరించారు.
కార్తీక్ రత్నం- ప్రకాష్ రాజ్- రావు రమేష్- మురళి శర్మ- సంపత్ రాజ్ ఈ చిత్రంలోని ఇతర తారాగణం. యాక్షన్-డ్రామా నేపథ్యంలో ఒక అణగారిన కుల కుటుంబం కథను తెరపై ఆవిష్కరించారు. ఇందులో ఉన్నత కులానికి చెందిన సంపన్న భూస్వామి సృష్టించిన ఇబ్బందులను అధిగమించడానికి నారప్ప సాగించిన పోరాటం ఏమిటన్నది తెరపై చూడాల్సిందే.
ఇటీవలే రిలీజైన నారప్ప ట్రైలర్ ఆకట్టుకుంది. ట్రైలర్ మాతృక అసురన్ ట్రైలర్ లో వెట్రీ ఉపయోగించిన అదే ఫార్మాట్ లో భావోద్వేగాన్ని కలిగించింది. ఈ చిత్రానికి ప్రేరణ తమిళ నవల వెక్కై. తమిళనాడులోని విస్తృతమైన కుల వ్యవస్థను మేల్ డామినేషన్ వారి కుల అహంకారాన్ని తెరపరిచిన కథాంశమిది. ఒక అందమైన కథను తెరపైకి తెచ్చేందుకు వెంకటేష్ - ప్రియమణి సహా తారాగణం అంకితభావంతో పని చేశారని చిత్రబృందం చెబుతోంది. అసురన్ నిర్మాత కలైపులి ఎస్. తానుతో పాటు ఈ చిత్రాన్ని డి.సురేష్ బాబు నిర్మించారు.
ఓటీటీ నిర్ణయం క్రైసిస్ భయంతోనే:
నారప్ప మొదట ఈ ఏడాది మే 14 న థియేటర్ విడుదలకు షెడ్యూల్ చేసినా..కరోనావైరస్ రెండవ వేవ్ విడుదల ప్రణాళికలను మార్చింది. మహమ్మారి ప్రభావం ఇంకా ఉన్నందున నిర్మాతలు ఈ చిత్రాన్ని నేరుగా స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంపై విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. OTT ని ఎంచుకున్నందుకు చిత్రనిర్మాతలు తెలంగాణలోని థియేటర్ యజమానుల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేరుగా నిర్మాతలను హెచ్చరించినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటీటీ మార్గాన్ని ఎంచుకోవాల్సొచ్చిందని సురేష్ బాబు వెల్లడించారు.
Full View