తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల కమీషన్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే ఉంది. కాని ఇప్పటికి కూడా చాలా మంది ఓటు విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పెద్ద ఎత్తు ఓటింగ్ శాతం నమోదు చేయించేందుకు ఎన్నికల కమీషన్ చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా సినిమా పరిశ్రమ వారు కూడా తమ వంతు అన్నట్లుగా ఓటర్లను చైతన్య పర్చేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఓటర్ల చైతన్యం కోసం తాజాగా ‘సర్కార్’ తెలుగు వర్షన్ కోసం చంద్రబోస్ ఒక పాటను రాయడం జరిగింది. ఆ పాటను తాజాగా సోషల్ మీడియాలో చంద్రబోస్ పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నిక రోజు ఎన్ని పనులు ఉన్నా కూడా ముందు ఓటు వేసి, ఆ తర్వాత పనులు చూసుకోవడం నాకు అలవాటు అంటూ చంద్రబోస్ పేర్కొన్నాడు. సర్కార్ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చంద్రబోస్ రాసిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సర్కార్ చిత్రాన్ని తెలుగులో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఉరికితే ఉద్యమం– ఉరిమితే విప్లవం
వేలి చివర నలుపు రంగు – మార్చునంటా బతుకురంగు
మనకంఠం గంటలు మోగిస్తే అధికారపీఠం అదరాలే...
సగటు మనిషి చేతి స్పర్శకే జగతి రాత మారాలే.
బెదురుగా ఆగడం– కిందకే అణగడం
ఎదురుగా నిలవడం– ఎత్తుకే ఎదగడం
నోటుకు ఓటు అమ్మేశావే– మందే తాగి తొంగున్నావే
మత్తే దిగి మేల్కోన్నావే
ఉరిమితే ఉద్యమం–ఉరికితే విప్లవం
మీ రంగుల బొమ్మల వెల
మా రక్తం అయితే ఎలా
ఈ రాజ్యం మారుట కల
నిలదీసి అడుగుదాం
మోసమే జరిగితే – కన్నులే మూసినం
ద్రోహమే పెరిగితే– ఖర్మగా తలచినాం
విందులే వద్దులే– తిండినే అడిగినాం
మేడలే వద్దులే– నీడకై నలిగినాం
నదులలో నీటినే– కళ్ళలో దాచినాం
గుండెలో మండినాం–బూడిదై బతికినాం
కమ్ముకున్న మత్తు వీడితే–
కనబడునోయ్ కొత్త కాంతులే