గతానికి భిన్నంగా ఉత్కంఠ పరిస్థితుల నడుమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగటం తెలిసిందే. ఎన్నికల వేళ వాతావరణం హీటెక్కటం.. ఆ తర్వాత చల్లారటం ఇప్పటివరకూ చూడగా.. ఈసారి అందుకు భిన్నంగా మా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వివాదాలు ఒక కొలిక్కి రాకపోవటం తెలిసిందే. చివరకు సభ్యుల ప్రమాణస్వీకారం విషయం సైతం ఇష్యూగా మారిన వైనం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాజాగా మా నూతన కార్యవర్గం తొలి సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ మీటింగ్ కు మా అధ్యక్షుడు నరేశ్.. జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్.. ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు సమావేశమయ్యారు. రానున్న రెండేళ్లకు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాల్ని వెల్లడించారు.
మా కొత్త కార్యవర్గం తీసుకున్న కొత్త నిర్ణయాల్ని చూస్తే..
+ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్వత్వం తీసుకున్న సభ్యులు తమ సమస్యలను తెలిపేందుకు హెల్ప్ లైన్ నంబర్ 9502030405కి సంప్రదించాలి.
+ పింఛనుదారులకు గతంలో అందించే పింఛనుకు అదనంగా రూ.1000 పెంచి రూ. 6 వేలను వారి ఖాతాలో జమ చేస్తాం.
+ పింఛనుదారుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పెంచిన రూ.1000 వారి వైద్య ఖర్చుల కోసమే.
+ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మా సభ్యులకూ వర్తింపజేసేలా అతి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాం.
+ మా అసోసియేషన్‌లో కొత్తగా సభ్యత్వం తీసుకునే వారి కోసం రెండు రకాల పద్ధతులను ప్రవేశపెడుతున్నాం. రూ. 25 వేలు చెల్లించిన నూతన సభ్యునికి గోల్డ్‌కార్డు ఇస్తాం. దీని కాలపరిమితి రెండేళ్లు. ఈ రెండేళ్లలో మిగతా రూ.75 వేలు చెల్లిస్తే.. వారు జీవితకాల సభ్యత్వ కార్డు పొందుతారు.
+ శాశ్వత సభ్యునిగా గుర్తింపు పొందనంత వరకు ‘మా’ తరఫున ఎలాంటి సౌకర్యాలు వీరికి వర్తించవు. రెండో పద్ధతిలో రూ.90 వేలు చెల్లించిన వారికి రూ.10 వేల రాయితీతో పాటు శాశ్వత సభ్యత్వ కార్డు అందజేస్తాం. ఈ అవకాశం 100 రోజులు మాత్రమే ఉంటుంది.
+ మా సభ్యులందరికీ గతంలో రూ.2 లక్షల వరకు ఎస్ బీఐ సంపూర్ణ సురక్షా జీవిత బీమా ఉంది. ప్రస్తుతం దీనికి అదనంగా మరో రూ.లక్ష పెంచి రూ.3 లక్షల బీమాను అందించనున్నాం.