సెప్టెంబరులో ‘మా’ ఎన్నికలు జరిగే ఛాన్స్ లేదా?

Update: 2021-06-27 04:37 GMT
ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ప్రకటనతో మొదలైన వేడి.. ఈ వారమంతా సాగింది. చూస్తుంటే మరికొన్ని రోజలు ఇదే అంశం హట్ టాపిక్ గా మారుతుందని చెప్పాలి. మరో నెల పాటు తాము ఎలాంటి ప్రెస్ మీట్లు.. వివరణలు ఇచ్చేది లేదని ప్రకాశ్ రాజ్ టీం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్న వారే మాట్లాడే అవకాశం ఉందంటున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. ఆర్థిక సంవత్సరం పూర్తి అయి దానికి సంబంధించిన లెక్కలు అన్ని అయ్యాకే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్న సూచనతో పాత బాడీ ఎన్నికల్ని ఆపింది. లెక్కలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కొవిడ్ విరుచుకుపడటంతో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది..

తాజాగా ఎన్నికల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరో మూడు నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకు సెప్టెంబరును ముహుర్తంగా ఎంచుకున్నారు. అయితే.. అందరూ అనుకున్నట్లుగా సెప్టెంబరులో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.

ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం కొవిడ్ థర్డ్ వేవ్ సెప్టెంబరులో షురూ అవుతుందని చెబుతున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బయటకు రావటం.. ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్న నేపథ్యంలో కేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే థర్డ్ వేవ్ కాస్త ముందే వచ్చే వీలుంది. అదేజరిగితే.. ‘మా’ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న సెప్టెంబరుకు పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యే వీలుంది. అలాంటి పరిస్థితే ఉంటే.. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ‘మా’ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News