ప్ర‌భాస్, నాగార్జున‌ల‌తో `మా` ఈవెంట్‌

Update: 2019-02-26 09:13 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం  సొంత భ‌వంతి నిర్మాణం అన్న‌ది ఇప్ప‌టికీ ఓ ఫ‌జిల్ గానే మిగిలిపోయిందన్న నిర్వేద‌న టాలీవుడ్ ఆర్టిస్టుల్లో వ్య‌క్త‌మైంది. వందేళ్ల భార‌త‌దేశ చ‌రిత్ర‌లో 89ఏళ్ల హిస్ట‌రీ టాలీవుడ్ కి ఉంది. `మా` అధికారిక సంఘంలో 750 మంది పైగా ఆర్టిస్టులు ఉన్నారు. చిన్నా చిత‌కా ఇత‌ర అన‌ధికారిక లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌త్య‌క్ష ప‌రోక్షంగా వేలాది మంది ఆర్టిస్టులు రెగ్యుల‌ర్ గా ముఖానికి రంగేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇంత పెద్ద ప‌రిశ్ర‌మ‌లో సొంత భ‌వంతి నిర్మాణం ఎందుకు క‌ష్ట‌మ‌వుతోంది? అంటే అందుకు `మా` అసోసియేష‌న్ గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్య‌మేన‌న్న మాట వినిపిస్తోంది. ఎవ‌రి హ‌యాంలో వాళ్లు ప‌బ్బం గ‌డిపేశారే కానీ, ఏనాడూ ఆర్టిస్టుల బాగు కోసం కృషి చేయ‌లేదట‌. అందుకే అస‌లు ఏ బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా శివాజీ రాజాని రెండోసారీ అధ్య‌క్షుడిని చేసేందుకు ఆర్టిస్టులంతా స‌న్నాహాలు చేస్తున్నారు.

అయితే సొంత భ‌వంతి అంటే అంత సులువా?  కాస్త పెద్ద‌ స్థ‌లమే కావాలి. పైగా నిర్మాణానికి బోలెడంత డబ్బు కావాలి. అందుకే ఈ నిర్మాణం క‌ష్ట‌మ‌వుతోంది. అయితే మా బిల్డింగ్ నిర్మించడానికి 2019లో పునాది రాయి వేసి తీర‌తామ‌ని ప‌ట్టుద‌ల‌గా చెబుతున్నారు ప్ర‌స్తుత అధ్య‌క్షుడు శివాజీ రాజా. మా అసోసియేష‌న్ సొంత భ‌వంతి నిర్మాణం స‌హా ప‌లు సేవాకార్య‌క్ర‌మాల కోసం సాయం కోరితే మెగాస్టార్ చిరంజీవి ఎంతో స‌హాయం చేశారు. విదేశాల్లో నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. మెగాస్టార్ ప్రోత్స‌హంతో విజ‌యవంతంగా 3కోట్ల నిధిని సేక‌రించాం. త‌దుప‌రి నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాలు చేస్తాం. ప్ర‌భాస్, నాగార్జున గారిని సంప్ర‌దిస్తే ఎంతో పాజిటివ్ గా స్పందించారు. ఇంకా పెద్ద స్టార్ల స‌హ‌కారం కోరుతున్నామ‌ని తెలిపారు.

మ‌హేష్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది క‌దా? అని ప్ర‌శ్నిస్తే.. మ‌హేష్ గారితో చేయాల్సిన ఈవెంట్ దుర‌దృష్ట‌వ‌శాత్తూ క్యాన్సిల్ అయ్యింది. న‌మ్ర‌త‌గారితో ట‌చ్ లోనే ఉన్నాం. పేద‌ల సాయం కోసం వారు ముందుకు వ‌స్తారు. అలాగే లండ‌న్ లో ఏప్రిల్ లో నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఎంద‌రో ఆర్టిస్టులంతా సాయం చేస్తున్నార‌ని తెలిపారు. నిధి సేక‌ర‌ణ కోసం ఈ ఏడాది మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని అన్నారు. ఈ ఏప్రిల్ లో లండ‌న్ లో ఈవెంట్ నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. కొన్నిటికి స‌మాధానం మార్చి 11 న చెబుతాన‌ని కాస్త ఖ‌రాకండిగానే చెప్పారు.


Tags:    

Similar News