మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అధ్యక్ష బరిలో ఛతుర్ముఖ పోటీ ఇప్పటికే ఖరారైంది. ప్రకాష్ రాజ్- మంచు విష్ణు మధ్యనే ప్రధాన పోటీ నెలకొనగా.. జీవిత రాజశేఖర్ - హేమ లాంటి మహిళామణులు ఈసారి పోటీకి దిగుతుండడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
అయితే ఆ నలుగురే కాదు.. ఐదో అభ్యర్థి ఈసారి బరిలోకి దిగుతున్నానని ప్రకటించడం ఆసక్తిని పెంచుతోంది. సీనియర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు ఈ ఏడాది అధ్యక్ష పదవికి తాను కూడా పోటీ పడుతున్నానని ప్రకటించారు. `తెలంగాణ వాదం`తో తాను ప్యానెల్ ఏర్పాటు చేసి పోటీకి దిగుతున్నానని స్పష్ఠంగా చెప్పారు. అవకాశాల విషయంలో తెలుగు వారికి న్యాయం జరగాలనేది తన వాదన అని అన్నారు. 2009లో తెలంగాణ ఆర్టిస్టులతో సపరేట్ గా `మా` ఏర్పాటైందని .. మా అసోసియేషన్ రెండుగా ఉండాలని సినీపెద్దలను కోరామని కూడా తెలిపారు.
ఇక `మా` సభ్యుల సంక్షేమం కోసం పాటుపడతానని ఆయన అన్నారు. మొత్తానికి `మా` ఎన్నికల్లో తెలంగాణ వాదం అనేది కొత్త అంశం కాగా.. దానికి ప్రతినిధిగా సీనియర్ నటుడు పదవికి పోటీపడడం ఆసక్తిని కలిగిస్తోంది.