'మా' ఎన్నికలు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిట్స్ లోని పబ్లిక్ స్కూల్ లో 8గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ 'మా' ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు.
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
పవన్ తర్వాత వరుసగా చిరంజీవి, రాంచరణ్, బాలక్రిష్ణ, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ సెంటర్ వద్ద చిన్న ఘర్షణ జరిగింది. ఈ సమయంలోనే మంచు విష్ణు ప్యానెల్ కు చెందిన శివబాలాజీ చేయిని ప్రకాష్ రాజ్ ప్యానల్ కు చెందిన నటి హేమ కొరికినట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే శివబాలాజీ గాయాన్ని మీడియాకు నటుడు నరేశ్ చూపించారు. ఈ సందర్భంగా శివబాలాజీ మాట్లాడుతూ 'అలా ఎందుకు కొరికారో' నాకు తెలియదు.. కానీ కావాలనే కోరికారు అంటూ శివబాలాజీ చెప్పుకొచ్చాడు. గందరగోళం నెలకొనడంతో 'మా' ఎన్నికల కౌంటింగ్ ను ఆపినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.