గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మృతి చెంది ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఆయన గురించి జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారంటే ఆయన ఎంతగా కర్ణాటక మరియు తమిళనాడు ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘ కాలం పాటు ఇబ్బంది పెట్టిన వీరప్పన్ ను ఎన్ కౌంటర్ చేయడం జరిగింది. వీరప్పన్ చనిపోయిన తర్వాత ఆయన బయోపిక్ లను మరియు ఆయన ఎన్ కౌంటర్ కు సంబంధించిన విషయాలను వెండి తెరపై చూపించారు. రామ్ గోపాల్ వర్మ కూడా వీరప్పన్ పై సినిమా తీశాడు. వీరప్పన్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇప్పటికి ఆయన ఇద్దరు కూతుర్లకు జనాల్లో గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును ఉపయోగించుకుని ఇద్దరు కూడా రాజకీయాల్లో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద కూతురు ఇటీవలే బీజేపీలో చేరగా చిన్న కూతురు విజయలక్ష్మి మాత్రం నటిగా మారి అదృష్టంను పరీక్షించుకుంటుంది.
వీరప్పన్ రెండవ కూతురు విజయలక్ష్మి 'మావీరన్ పిళ్లై' అనే సినిమాతో నటిగా తెరంగేట్రం చేస్తుంది. తన తండ్రి కథనే ఈమె లేడీ వర్షన్ లో చెబుతుందా అన్నట్లుగా మావీరన్ పిళ్లై సినిమా ఫస్ట్ లుక్ ఉంది. ఆ పోస్టర్ లో విజయలక్ష్మి సీరియస్ లుక్ తో తండ్రి ఎలా అయితే గన్ ను భుజంపై పెట్టుకుని ఉంటాడో అలాగే ఉంది. తండ్రికి తగ్గ వారసురాలే అనిపించుకుంటుంది. అయితే ఆయన రియల్ స్మగ్లింగ్ లో కింగ్ అయితే ఈమె వెండి తెరపై స్మిగ్లింగ్ చేసి క్వీన్ అనిపించుకుంటుందేమో చూడాలి. వీరప్పన్ కూతురు సినిమా రంగ ప్రవేశంపై జనాల రియాక్షన్ ఏంటీ అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఆమెను ఎలా ఆధరిస్తారనేది కూడా చూడాలి.