రానా చేతుల మీదుగా విడుదలైన కట్టప్ప తనయుడి 'మాయోన్' టీజర్..!

Update: 2021-10-09 05:33 GMT
కట్టప్పగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ''మాయోన్''. నూతన దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంలో తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన తమిళ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా తెలుగు టీజర్ లాంచ్ చేశారు.

హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ''మాయోన్'' టీజర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ''#Maayon తెలుగు టీజర్ ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ఇది చాలా ఆసక్తికరంగా కనిపిస్తోందని చెప్పాలి. పూర్తి సినిమా చూడటానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. చిత్ర బృందానికి శుభాకాంక్షలు'' అని రానా పేర్కొన్నారు.

'మాయోన్' టీజర్ విషయానికొస్తే.. 'స్వర్ణ మద్యం జల క్రీడించి.. సేదతీరే తధాక తీరం చనుధించారు..' అనే గ్రాంథికలు సంభాషణతో ప్రారంభమైంది. ఐదు వేల ఏళ్ల క్రితం నాటి ఒక దేవాలయం మిస్టరీని చేధించే కథాంశంతో ఈ థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీ రూపొందినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాని తీసినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

కెమెరామెన్ రామ్ ప్రసాద్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మాస్ట్రో ఇళయరాజా సమకూర్చిన నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో రాధా రవి - కేఎస్ రవికుమార్ - భగవతి పెరుమాళ్ - హరీష్ పెరడి - అరహ్ షా తదుపరి కీలక పాత్రల్లో కనిపిస్తున్నాయి. ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠ భరితంగా సాగిన 'మాయోన్' టీజర్ ఆకట్టుకుంటోంది.

డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ బ్యానర్ పై అరుణ్ మోజీ మనిక్కమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మాయోన్' మూవీకి నిర్మాత స్క్రీన్ ప్లే కూడా అందిస్తుండటం విశేషం. బాలసుబ్రహ్మణ్యం దీనికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. రామ్ పాండియన్ - కొండలరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


Full View
Tags:    

Similar News