నితిన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఈ వారంలో విడుదలకు సిద్ధం అయ్యింది.
ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు ట్రైలర్ తో పాటు అంజలి ఐటెం సాంగ్ ఇతర సాంగ్స్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. తాజాగా సినిమా పై మరింత ఆసక్తిని పెంచేందుకు గాను మేకింగ్ వీడియో వచ్చింది.
సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం నితిన్ మరియు టీమ్ ఎంతగా కష్టపడ్డారో చూపిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. నితిన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా యాక్షన్ సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డారు. సాదారణంగా భారీ యాక్షన్ సన్నివేశాల్లో కాస్త టెక్నాలజీ వాడటం ద్వారా హీరోలకు శ్రమ తగ్గిస్తారు.
కానీ ఈ సినిమా లో నితిన్ ఎక్కువగా టెక్నాలజీ వాడినట్లుగా అనిపించలేదు. కష్టపడి మరీ యాక్షన్ సన్నివేశాల్లో ఈయన నటించినట్లుగా ఈ మేకింగ్ వీడియో ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నితిన్ మరియు యాక్షన్ టీమ్ చాలానే ప్రాక్టీస్ లు వర్కౌట్ లు చేసినట్లుగా ఈ మేకింగ్ వీడియోలో చూడవచ్చు.
భారీ అంచనాలున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం ఈనెల 12వ తారీకున విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. సినిమా లో నితిన్ కు జోడిగా కృతి శెట్టి నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. ఆమె ఉప్పెన తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. ఈమె చేసిన ప్రతి సినిమా కూడా మినిమం అన్నట్లుగా ఆడుతుంది. అందుకే ఈ సినిమా కూడా ఆమె సెంటిమెంట్ తో ఆడుతుందనే నమ్మకంతో ఉన్నారు.
పైగా నితిన్ ఈ సినిమా కథ విషయంలో చాలా నమ్మకంతో ఉన్నాడని ఆయన ఇంటర్వ్యూలు చూస్తే అర్థం అవుతుంది. ఇక ఈ సినిమాలోని అంజలి ఐటెం సాంగ్.. అందులో వచ్చే రాను రాను అంటూ.. స్టెప్స్ అన్ని కూడా సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయంటూ సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు చర్చించుకుంటున్నారు.
Full View