ఇంతకుముందు సౌత్ స్టార్ హీరో సూర్య `ఆకాశం నీ హద్దురా` చిత్రంతో బయోపిక్ కేటగిరీలో ప్రయోగం చేసి సక్సెసయ్యారు. గుంటూరు జిల్లాలోని చుండూరు గ్రామానికి చెందిన ఒక సాధారణ స్కూల్ మాస్టారు కొడుకు డెక్కన్ ఎయిర్ అనే విమానయాన సంస్థను ఎలా స్థాపించగలిగాడు అనేదే ఈ చిత్ర ప్రధాన కథ. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాకుడు కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా చేసుకుని విమానయాన రంగంలో వచ్చిన మార్పులను వివరిస్తూ కొంత కల్పిత కథను జతచేసి ఈ సినిమాను రూపొందించారు. సుధ కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలై గొప్ప ప్రశంసలతో పాటు అసాధారణ ఆదరణతో విజయం అందుకుంది.
ఇప్పుడు అదే తరహాలో మరో తెలుగు పారిశ్రామిక వేత్త కథతో సినిమా తెరకెక్కుతోంది. స్టార్ హీరో రాజ్ కుమార్ రావు ఈ ప్రయోగాత్మక బయోపిక్ లో నటిస్తున్నారు. రాజ్ కుమార్ రావ్ నటనానైపుణ్యం గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ కి లభించిన ఆణిముత్యం. గొప్ప నటుడిగా రాజ్ కుమార్ రావు కీర్తినందుకున్నారు. ఎలాంటి పాత్రకైనా ప్రాణ ప్రతిష్ట చేయగల నటుడిగా నిరూపించారు. అదీ బయోపిక్ ల్లో ..వాస్తవ కథల పాత్రలో రాజ్ కుమార్ రావు ఎలా ఒదిగిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా రాజ్ కుమార్ రావు తెలుగు పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లం జీవిత కథలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇది రాజ్ కుమార్ రావుకి సాహసోపేతమైన రోల్ గా చెప్పొచ్చు.
శ్రీకాంత్ బొల్లం జీవితం ఎంతో స్ఫూర్తిదాయం. అతనికి పుట్టుకతోనే దృష్టి లోపుం ఉంది. అయినా తనకంటూ చరిత్రలో కొన్ని పేజీలు రాసి పెట్టారు. వైకల్యం ఉన్నా శ్రీకాంత్ లక్ష్యం ముందు చిన్నదిగానే కనిపించింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని గొప్ప పారిశ్రామవిక వేత్తగా ఎదిగారు. బోలాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడి గా ఖ్యాతికెక్కారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్స్ అండ్ బిజినెస్ లో మొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి గాను శ్రీకాంత్ రికార్డు నెలకొల్పారు. శ్రీకాంత్ చిన్న నాటి నుంచి ఎంతో తెలివైన విద్యార్ధి. అతనిలో ఆ ప్రతిభనే ఇంత గొప్పవాడిని చేసిందని బలంగా నమ్మే వ్యక్తి ఆయన.
ఇప్పుడు ఆయన పాత్రని రాజ్ కుమార్ రావు పోషించడం విశేషం. ఈ స్క్రిప్ట్ విన్న వెంటనే రాజ్ కుమార్ రావు మరో డిస్కషన్ లేకుండా సింగిల్ సిట్టింగ్ లో నే ఒకే చేసారు. తుషారా హిరానందని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్- నిధి పర్మార్ హీరానందని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జులై లో సినిమా ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జులైలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక శ్రీకాంత్ బొల్లాం స్వస్థలం మచిలీపట్నం. అతడికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. చూస్తుంటే బాలీవుడ్ వాళ్లు నెమ్మదిగా సౌత్ ప్రతిభావంతుల కథల్ని లాక్కెళ్లి పాన్ ఇండియా కేటగిరీలో హిట్లు కొట్టడం కనిపిస్తోంది. ఇంతకుముందు సిల్క్ స్మిత బయోపిక్ ని ఏక్తాకపూర్ తెలివిగా క్యాష్ చేసుకున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ లో బయోపిక్ ల వెల్లువ కొనసాగుతోంది. క్రీడా బయోపిక్ లతో పాటు దమ్మున్న ప్రముఖుల కథాంశాల్ని ఎంచుకుని సెట్స్ కెళ్లేందుకు వెనకాడడం లేదు. ఇదే తరహాలో శ్రీకాంత్ బొల్లం బయోపిక్ తో మరో పాన్ ఇండియా హిట్ కొట్టే ప్రయత్నం సాగుతోంది.