ఆ నలుగురు లాంటి మంచి సినిమాతో రచయితగా పరిచయమై ఆ తర్వాత దర్శకుడిగా పెళ్లైన కొత్తలో, ప్రవరాఖ్యుడు లాంటి అభిరుచి ఉన్న సినిమాలు తీశాడు మదన్. ఐతే ప్రవరాఖ్యుడు తర్వాత ఐదారేళ్లుగా కనిపించకుండా పోయిన మదన్ ఎట్టకేలకు.. గరం సినిమాతో మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. మరీ ఇంత గ్యాప్ ఏంటని అడిగితే.. ప్రవరాఖ్యుడు తర్వాత ఇబ్బందుల్లో పడ్డానని, అసలు సినిమాలే మానేద్దామన్నంత విరక్తి కలిగిందని అంటున్నాడు మదన్.
‘‘2009లో ప్రవరాఖ్యుడు సినిమా రిలీజ్ అయిన టైంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు జరిగినా.. సినిమా బాగానే ఆడింది. ఆ సక్సెస్ ను రెండేళ్లు ఎంజాయ్ చేశా. ఐతే ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో డబ్బులు రాలేదు..దాని తర్వాత సొంత వ్యాపారం మొదలుపెట్టాను. అది కలిసి రాలేదు. అప్పుడు బాగా నిరాశ చెందాను. 2012లో ఇండస్ట్రీ వదిలేద్దామని కూడా అనుకున్నాను. కానీ ఎందుకో ఇందుకే ఇక్కడే ఉండిపోవాలనిపించింది’’ అన్నాడు మదన్.
గరం సినిమా ఆలస్యం కావడం గురించి చెబుతూ.. ‘‘ఈ సినిమాను 2014 ఆగస్టులో మొదలుపెట్టాం. తర్వాత ఆదికి పెళ్ళి కావడం, దీని నిర్మాత తప్పుకోవడం.. నేను నా మిత్రుణ్ని కోల్పోవడం లాంటి కారణాలతో ఆలస్యమైంది. కొన్ని పర్సనల్ సమస్యల వల్ల బాగా క్రుంగిపొయాను. ఆ కోమా నుండి బయటకు వచ్చి ఈ సినిమా పూర్తి చేయడానికి సమయం పట్టింది’’ అని మదన్ చెప్పాడు.