భిన్నమైన సినిమాలు చేసే నటుడిగా సుపరిచితుడు మాధవన్. లవర్ బాయ్ గా.. చాక్లెట్ బాయ్ గా సుపరిచితుడైన ఆయన.. తర్వాతి కాలంతో సెలెక్టివ్ పాత్రల్ని మాత్రమే చేస్తూ.. రోటీన్ సినిమా హీరోలకు భిన్నమైన సౌత్ హీరోగా నిలిచారని చెప్పాలి. ప్రముఖ ఇస్త్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ బయోగ్రఫీని ఆధారంగా చేసుకొని.. ఆ పాత్రను తానే పోషించిన మూవీ 'రాకెట్రీ'.
ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏమంటే.. రాకెట్రీకి దర్శకుడిగా మాధవన్ అవతారమెత్తారు. జులై ఒకటిన దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ను ఈ మధ్యన ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలకు నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. రాకెట్ లను ప్రయోగించటానికి ఇస్త్రోకు పంచాంగం ఉపయోగపడిందన్న వ్యాఖ్యలపై ఆయన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఈ విమర్శలకు తాను అర్హుడినేనని చెప్పిన ఆయన.. తన అవగాహన లోపంతోనే ఈ వ్యాఖ్యలు చేశానని ఒప్పుకున్నారు. తాను వ్యాఖ్యలు చేసినంత మాత్రాన రెండు ఇంజిన్లు ఉపయోగించి మార్స్ మిషన్ ను విజయవంతం చేయటం నిజం కాకుండా పోదు కదా? అదెప్పటికి రికార్డేనని వ్యాఖ్యానించారు.
అంగారక కక్ష్యలో చేరేందుకు ఇస్రోకు పంచాంగం ఉపయోగపడిందన్న మాధవన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ఇస్త్రో వాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహుర్త బలంతోనే భారత మార్స్ మిషన్ అవాంతరాల్ని అధిగమించిందన్నారు. గ్రహాల స్థితిగతుల్ని పంచాంగంలో నిక్షిప్తమై ఉంటాయన్న ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కు గురవుతున్నాయి.
సైన్స్ తెలీకపోవటం సమస్య కాదు కానీ అసలు విషయం తెలుసుకోకుండా ఇలా మాట్లాడటమా? దానికి బదులుగా మౌనంగా ఉంటే మంచిది కదా? అంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాధవన్ రియాక్టు అవుతూ.. తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనపై వచ్చిన విమర్శలకు తాను అర్హుడినన్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.