మాధవన్ కొడుకు అంతపని చేశాడా

Update: 2017-02-18 07:50 GMT
తమిళ హీరో మాధవన్ కెరీర్ కొంచెం స్లో అయినట్లు కనిపించినా.. గతేడాది చేసిన సాలా ఖడూస్ తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ.. క్రేజీ ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్రొఫెషనల్ గా మళ్లీ సత్తా చాటుతున్న ఈ హీరో.. ఇప్పుడు పర్సనల్ గా ఫుల్ హ్యాపీ అంటున్నాడు.

తాజాగా జరిగిన ఓ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో మాధవన్ కొడుకు వేదాంత్ ఓ రికార్డ్ సృష్టించాడు. దీంతో చాలా హ్యాపీ అయిపోయిన మాధవన్.. తన కొడుకుతో దిగిన ఓ ఫోటోను షేర్ చేసి.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'ఓ తండ్రిగా గర్వంగా భావించే క్షణం ఇది. ఖాన్ జిమ్ లో జరిగిన స్విమ్మథాన్ లో నా కొడుకు వేదాంత్.. 4 కిలో మీటర్లను 57 నిమిషాల్లోనే ఈదేశాడు. నేను ఈ ఫీట్ ను కనీసం ఊహించుకోలేను కూడా' అంటూ ట్వీట్ చేశాడు మాధవన్.

కొడుకు వేదాంత్ తో కలిసి.. మాధవన్ పోస్ట్ చేసిన ఫోటో అభిమానులను అలరిస్తోంది. జూనియర్ మాధవన్ అప్పుడే రికార్డులు కొట్టేస్తున్నాడంటే.. ఫ్యూచర్ లో మరెన్ని సృష్టించబోతున్నాడో అనుకుంటున్నారు అభిమానులు. మరోవైపు మాధవన్ విక్రమ్ వేద అని తమిళ్ మూవీలోను.. చందమామ దూర్ కే అనే హిందీ చిత్రంలోనూ నటిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News